జబర్దస్త్లో విచిత్రాలు చాలా కనిపిస్తున్నాయి. ఈ వారం కనిపించిన జడ్జిలే వచ్చే వారం కనిపించడం లేదు. ఆ మధ్య అది బాగా జరిగింది. అప్పట్లో రోజా, నాగబాబు ఉన్నపుడు కొన్నేళ్ల పాటు వాళ్లు తప్ప మరొకరు కనిపించలేదు. ఎంత బిజీగా ఉన్నా కూడా కచ్చితంగా జబర్దస్త్ కామెడీ షో మాత్రం మిస్ చేయలేదు. వాళ్ళు ముందు దానికి డేట్స్ ఇచ్చిన తర్వాతే మిగిలింది చూసుకునేవాళ్లు.
రోజా అయితే ఎంత బిజీగా ఉన్నా జబర్దస్త్ను ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు. రాజకీయంగా విమర్శలు వస్తున్నా కూడా తను మాత్రం ఈ షో భుజాన వేసుకుని ముందుకు వస్తూనే ఉన్నారు. తనపై విమర్శలు చేస్తున్నా కూడా.. రాజకీయం, సినిమా రంగం వేరు అంటూ సమాధానం చెప్తుంది రోజా. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండటంతో పాటు ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా కూడా జబర్దస్త్ కామెడీ షోకు డేట్స్ ఇస్తున్నారు రోజా.
అయితే కొన్ని నెలలుగా ఈమె అప్పుడప్పుడూ ఈ షోను మిస్ అవుతున్నారు. ఆ మధ్య అనారోగ్యం కారణంగా కొన్ని వారాలు జబర్దస్త్ షోలో కనిపించలేదు. ఆ తర్వాత మళ్లీ వచ్చింది. కానీ మళ్లీ ఈ వారం రోజా మిస్ అయింది. పూర్తిగా దూరమైందని కాదు కానీ గ్యాప్ అయితే తీసుకుంది. ప్రస్తుతం ఈమె రాజకీయంగా కూడా చాలా బిజీ. అందుకే ఓ వారం మళ్లీ బ్రేక్ తప్పలేదు.
మనో ఎలాగూ కంటిన్యూ అవుతున్నాడు. ఆయనతో పాటు ఈ వారం ఇంద్రజ జడ్జిగా వచ్చింది. అప్పట్లో అలా మిస్ అయినపుడు ఒక్కో వారం ఒక్కొక్కరిని జడ్జిలుగా తీసుకొచ్చి కవర్ చేసారు మల్లెమాల. అయితే ఇప్పుడు ఇంద్రజ మల్లెమాలలో మెంబర్ అయిపోయారు. ఆమె తన అందంతో పాటు అభినయం, జడ్జిమెంట్తోనూ ఆకట్టుకుంటుండటంతో పర్మినెంట్ జడ్జిగా మారిపోతున్నారు.