ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మోడల్స్ దుర్మరణం పాలయ్యారు. మిస్ కేరళ విన్నర్, రన్నరప్ ఒకేసారి రోడ్డు ప్రమాదంలో కన్నుమూసారు. ఓ బైక్‌ను తప్పించబోయి కారు ప్రమాదానికి గురి కావడంతో వాళ్లు స్పాట్లోనే చనిపోయారు. అసలు విషయాల్లోకి వెళ్తే కేరళలో జరిగిన దారుణమైన యాక్సిడెంట్లో మిస్ కేరళ 2019 టైటిల్ విన్నర్ అన్సీ కబీర్, రన్నరప్ అంజనా చనిపోయారని పోలీసులు తెలిపారు.
ఈ దారుణమైన ఘటన ఎర్నాకుళం బైపాస్‌లోని హాలిడే ఇన్ ముందు తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్‌కు రెండు గంటల ముందు అన్సీ కబీర్ తన ఇన్‌స్టాలో ఇట్స్ టైమ్ టూ గో అంటూ రాసుకొచ్చింది. ఆ తర్వాత ప్రమాదం జరిగింది. ఇది చూసి దేవుడే ఆమెతో అలా రాయించాడేమో అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు కుటుంబ సభ్యులు. అన్సీ, అంజనాతో పాటు ఈ కారులో మరో ఇద్దరు ఉన్నారు. వాళ్లిద్దరూ అబ్బాయిలు.
నలుగురు కలిసి అలా ట్రిప్ వెళ్లొస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఆ ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగానే ఉ:దని తెలుస్తుంది. 2019 సంవత్సరంలో మిస్ కేరళగా అన్సీ కబీర్, రన్నరప్‌గా అంజనా షాజన్ నిలిచారు. అన్సీ తిరువనంతపురం అట్టింగల్‌లోని అలంకోడ్ నుంచి వచ్చింది.. మరోవైపు అంజనా స్వస్థలం త్రిసూర్.
ఈ ఇద్దరూ ఆ అందాల పోటీ నుంచి మంచి స్నేహితులయ్యారు. అప్పట్నుంచి ఇద్దరూ కలిసే బయటికి వెళ్తున్నారు. జాలీ ట్రిప్స్ కూడా వెళ్లొస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే కారులో బయలుదేరారు. అయితే ఎర్నాకుళం బైపాస్ దగ్గరున్న హాలీడే ఇన్ ఎదుట ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి వాళ్ళ కారు ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు యాక్సిడెంట్ స్పాట్‌కు చేరుకున్నారు.
అయితే అప్పటికే అన్సీ కబీర్, అంజనా అక్కడికక్కడే చనిపోయారని.. గాయాలైన ఇద్దరినీ ఎర్నాకులం మెడికల్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్సీ, అంజనా మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఏదేమైనా ఒకేసారి ఇద్దరు అమ్మాయిలు చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు.