Amrutha Pranay: అమృత ప్రణయ్.. 2018లో మిర్యాలగూడలో అలజడి లేపిన పరువు హత్య గురించి తెలియని వారుండరు. కూతురు దళిత వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో అల్లుడిని దారుణంగా హత్య చేయించిన మారుతీ రావు గత సంవత్సరం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రాణంలా చూసుకున్న తండ్రి.. ప్రాణంలా ప్రేమించిన భర్తను పోగొట్టుకున్న అమృత.. ఇద్దరినీ తన కొడుకులో చూసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే అమృత యూట్యూబ్ ఛానెల్ తో పాటు.. ప్రేనం అనే పేరుతో సొంతంగా క్లాతింగ్ బ్రాండ్ ను ప్రారంభించింది. బిజినెస్ వుమెన్ గా మారిన అమృత కొన్ని ఔట్ ఫైట్స్ లోని ఫోటోలను షేర్ చేస్తూ.. ''ప్రణయ్.. నువ్వు ఇచ్చిన చిరునవ్వును ఇప్పటికి దరిస్తున్నాను'' అంటూ క్యాప్షన్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్.