Minister Roja - RK Selvamani | తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సెల్వమణి. అయితే ఈయన పేరు తెలుగులో పాపులర్ కావడానికి సినిమాల కంటే కూడా రోజా కారణం. ఎందుకంటే ఆమె భర్తగానే తెలుగు ఆడియన్స్కు పరిచయం అయ్యాడు సెల్వమణి. ఓ సందర్భంలో రోజా భర్త చేతిలో దారుణంగా నష్టపోయింది.
వీళ్లకు ఇద్దరు పిల్లలున్నారు.. ఓ అమ్మాయి, అబ్బాయి. తమ కాపురం చాలా హాయిగా ఉంటుందని.. సెల్వమణి దొరకడం తన అదృష్టం అని చాలాసార్లు చెప్పుకొచ్చింది రోజా. ఏదేమైనా ముందు ప్రేమించిన వాళ్లకు చెప్పి.. ఆ తర్వాత పెద్దలు ఒప్పుకోకపోతే చాలా రచ్చ చేసేకంటే కూడా ముందుగానే పెద్దలను ఒప్పించి ఆ తర్వాత ప్రేమించిన అమ్మాయికి చెప్పడం సమంజసం కదా. రోజా విషయంలో అదే చేసాడు సెల్వమణి.
తెలుగులో టాప్ స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో పాటు తమిళనాట సూపర్ స్టార్ రజినీ కాంత్, విజయ్ కాంత్ లతో రోజా ఓ వెలుగు వెలిగింది. కొంతకాలం సినిమాల నుంచి విరామం తీసుకుని రాజకీయాల్లో అడుగు పెట్టీ ఎమ్మెల్యేగా రాణించి.. ఫైర్ బ్రాండ్ లేడీగా పేరు తెచ్చకున్నారు. 'అంతేకాదు ఈమె ప్రస్తుతం మంత్రిగా రాణిస్తున్నారు. (File/Photo)
ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారి.. చివరకు మూడు ముళ్ల బంధంతో 2002లో ఒక్కటయ్యారు. అయితే రోజా, సెల్వమణి వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ, వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఎలా కొనసాగిందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. వాస్తవానికి సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్ని ముందుగా రోజాకు కాకుండా రోజా తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పారట. రోజా తండ్రిని ఒప్పించుకుని ఆ తర్వాత రోజాకు విషయం చెప్పాడట సెల్వమణి.
అయితే 1994లో సమరం అనే ఓ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రాన్ని స్వయంగా రోజా నిర్మాతగా అందులో సుమన్, రోజా, రఘుమాన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆర్ కె సెల్వమణి నిర్వహించగా, శ్రీ సాయిరోజా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకుర్చరు. కాగా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యింది. దీంతో రోజాకు ఆర్థిక నష్టాలు తప్పలేదు. ఇలా తన భర్త తీసిన సినిమా వల్ల రోజాకు ఆర్థికంగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది.