బాలయ్య ఓ వైపు సినిమాల్లో అదరగొడుతూనే టాక్ షోలోను కేక పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఆహా ఓటీటీ కోసం అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఓ టాక్ షోను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండో సీజన్ అక్టోబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్‌కు చంద్రబాబు, లోకేష్ వచ్చి అదరగొట్టారు. రెండో ఎపిసోడ్‌కు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చారు. ఇక మూడో ఎపిసోడ్‌కు శర్వానంద్, అడివిశేష్ వచ్చి అలరించారు. Photo : Twitter
నాల్గవ ఎపిసోడ్‌కు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాజ్యసభ ఎంపీ KR సురేష్ రెడ్డి వచ్చారు. ఐదో ఎపిసోడ్‌కు అల్లు అరవింద్, కోదండ రామిరెడ్డి, రాఘవేంద్రరావులు వచ్చారు. ఇక ఆరో ఎపిసోడ్‌కు ప్రభాస్, గోపీచంద్ వస్తున్నారు. ఈ బాలయ్య, ప్రభాస్‌ల ఎపిసోడ్ రెండు పార్ట్‌లుగా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే మొదటి పార్ట్ డిసెంబర్ 29 రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్కు వచ్చింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా అందరూ స్ట్రీమ్ చేయడంతో వచ్చిన అరగంటలోపే సర్వర్ క్రాష్ అయ్యింది. దీంతో ఆహా యాప్ కొన్ని గంటల వరకు పనిచేయలేదు. Photo : Twitter
ఇక అది అలా అంటే బాలయ్య షోపై ఒకప్పటి నటి, ప్రస్తుత ఏపీ మినిష్టర్ రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె అన్‌స్టాపబుల్ షో గురించి మాట్లాడుతూ.. తనకు ఆ షోకు వెళ్లడం ఇష్టం లేదని తెలిపారు. తాను బాలయ్య కలిసి ఏడు సినిమాల్లో నటించామని, మంచి అనుబంధం ఉందని అన్నారు. గతంలో అన్‌స్టాపబుల్ టీమ్ షోకు రావాలంటూ రెండుసార్లు పిలిచారని.. షోకు హాజరు కావాలనుకున్నా, ఆ రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో వెళ్లలేక పోయినట్లు తెలిపారు. Photo : Twitter
అయితే ఆ మధ్య అన్‌స్టాపబుల్ షోలో నారా చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ చూసిన తర్వాత, ఇక ఎప్పుడూ ఆ షోకు హాజరు కాకూడదని డిసైడ్ అయినట్లు తెలిపారు. ఎన్టీ రామారావు వెన్నుపోటు ఎపిసోడ్‌ను బాలయ్య, చంద్రబాబు ఆ షోలో ఎలా సమర్థించారో చూసి బాధపడ్డానని రోజా అన్నారు. ఇర ఆ రోజే షో కి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు రోజా. ప్రస్తుతం రోజా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్ తర్వాత పవన్, త్రివిక్రమ్‌తో పాటు ప్రసారం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ పూర్తి అయ్యిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌తో పాటు మరో దర్శకుడు క్రిష్ కూడా పాల్గోన్నారని తెలుస్తోంది. ఇక పవన్ , బాలయ్యల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగిందని.. పవన్ పర్సనల్ విషయాలపై కూడా బాలయ్య ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ ఉండనుందని అంటున్నారు నెటిజన్స్. Photo : Twitter
అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి అనే సినిమాను చేశారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా జనవరి 12న భారీగా విడుదలైంది. ట్రైలర్ అండ్ టీజర్స్‌తో కేక పెట్టించిన బాలయ్య సినిమా ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఓపెనింగ్స్ మాత్రం అఖండ సినిమా కంటే డబుల్ వచ్చాయి. Photo : Twitter
ఈ సినిమాకు బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రీ సేల్స్ ఓ రేంజ్లో ఉండడంతో పాటు కొన్ని మాస్ ఏరియాలో కూడా ముఖ్యంగా రాయలసీమ, నైజాంలో ఊహకందని ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు దాదాపుగా 29కోట్ల రేంజ్లో షేర్ అందుకుందని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. హాట్ స్టార్ బాలయ్య వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను దాదాపుగా 14కోట్లు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య గత చిత్రం అఖండ స్ట్రీమింగ్ రైట్స్ కూడా హాట్ స్టార్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి విడుదలైన ఎనిమిది వారాలకు హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్కు రానుంది. Photo : Twitter
ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హానీ రోజ్ నటించారు. సినిమాలో కంటెంట్ ఎక్కువగా మాస్కు అప్పీల్ అవ్వుతుండడంతో బి,సి సెంటర్స్‌లో వీరసింహారెడ్డి అదరగొట్టనుంది. చూడాలి మరి ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్లో రానున్నాయో.. Photo : Twitter
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 15 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 13 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 9 కోట్లు.. తూర్పు గోదావరి.. రూ. 5.2 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 5 కోట్లు.. గుంటూరు.. రూ. 6.40 కోట్లు.. కృష్ణ.. రూ. 5 కోట్లు.. నెల్లూరు .. రూ. 2.7 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 61.30 కోట్లు.. కర్ణాటక .. రూ. 4.50 కోట్లు.. రెస్టాఫ్ భారత్ .. రూ. 1 కోటి.. ఓవర్సీస్.. రూ. 6.2 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 74 కోట్ల షేర్ రాబట్టాలి. (Twitter/Photo)..
ఈ సినిమాలో కూడా లెజెండ్ తరహాలో పొలిటికల్ డైలాగులు పేలాయి. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ ఎటాక్ చేసారు. సంతకాలు పెడితే బోర్డు పై పేరు మారుతుందేమో... ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారుదు.. మార్చలేరు అంటూ.. రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై సెటైర్లు వేసారు బాలయ్య. (Twitter/Photo)
ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరు వీరయ్య, విజయ్ వారసుడు, అజిత్ తెగింపు సినిమాలు ఉన్నాయి.. చూడాలి మరి ఈ సినిమాల్లో సంక్రాంతి విన్నర్‌గా ఎవరు నిలవనున్నారో.. ఇక బాలయ్య ప్రధాన పాత్రలో బోయపాటీ శ్రీను దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ. డిసెంబర్ 2, 2021లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం హిందీలో కూడా విడుదలకానుందని తెలుస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. Photo : Twitter
నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ, ప్రధాన పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా 21 జనవరి 2022 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే అఖండ ఇప్పుడు హిందీలో భారీగా విడుదలకానుంది. ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు పెన్ స్టూడియోస్ ఈ సినిమాను అక్కడ భారీగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నిర్మాతలు ఓ ఫోస్టర్‌తో పాటు ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో సినిమా హిందీలో మంచి వసూళ్లను రాబట్టాలనీ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి అక్కడ ఎలా అఖండ ఆకట్టుకోనుందో.. Photo : Twitter
వీర సింహా రెడ్డి సినిమా తర్వాత బాలయ్య 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్ని పూర్తి అయ్యాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య బాబు మునుపెన్నడు చూడని అవతార్‌లో కనిపించనున్నాడట. ఈ సినిమాలో యువ హీరోయిన్ ‘పెళ్లిసందD’ భామ శ్రీలీల డాటర్‌గా కనిపించనుంది. Photo : Twitter
ఇక మరోవైపు ఆదిత్య 369ఈ సినిమాకు ఎప్పటి నుంచో సీక్వెల్ రాబోతుందని టాక్ వినపడుతోంది. అంతేకాదు ఈ సినిమాకు స్వయంగా బాలయ్యే దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తోంది. ఈ సినిమాకు“ఆదిత్య 999 మ్యాక్స్” అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు తెలిపారు బాలయ్య. ఆయన ఆహాలో వస్తున్న తన టాక్ షోలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉండనుందో.. అంటూ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. Photo : Twitter
ఇక బాలయ్య- అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో తన మార్క్ కామెడీ, కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ పుష్కలంగా ఉండేవిధంగా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు ఈ సినిమాలో బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు విన్నర్ బిందు మాధవి కూడా ఈ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు ఈ సినిమా గ్రాండ్ ఫినాలేలో అనిల్ రావిపూడి చెప్పారు. మరి బిందు మాధవికి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తాడా ? లేకపోతే వేరే ఏదైనా పాత్ర ఇస్తాడనేది చూడాలి. మొత్తంగా ప్రేక్షకులు మరిచిపోయిన బిందు మాధవికి అనిల్ రావిపూడి.. అది కూడా బాలయ్య సినిమాలో అవకాశం అంటే మాములు విషయం కాదు. మరి ఈ సినిమాతో బిగ్‌బాస్ బ్యూటీకి మరిన్ని అవకాశాలు వస్తాయా అనేది చూడాలి. Photo : Twitter