మినిష్టర్ రోజా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ముఖ్యంగా హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించింది. అక్కడ ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అంతేకాదు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మంత్రి పదవి ఆమెను వరించింది. దీంతో ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మనిష్టర్ అయిన రోజాకు సంబంధించిన ఆస్తులు వివరాలు మరోసారి వార్తల్లో నిలిచింది. (Twitter/Photo)
ఈమె అసలు పేరు శ్రీ లతా రెడ్డి. ఈమె 1972 నవంబర్ 17న నాగరాజ రెడ్డి, లలితా దంపతులకు ఉమ్మడి ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి జన్మించారు. ఆ తర్వాత వీళ్ల కుటుంబం హైదరాబాద్ షిప్ట్ అయింది. రోజా వాళ్ల నాన్న సినిమాకు సంబంధించిన డిపార్ట్మెంట్లోనే పనిచేయడంతో ఈమె సినీ ఎంట్రీకి పెద్దగా ఇబ్బంది లేకపోయింది. (File)
ఇక రోజా వాళ్ల అమ్మ కూడా నర్స్‌గా పనిచేసి ఒక కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యారు. రోజా తన విద్యాభ్యాసానికి సంబంధించిన విషయానికొస్తే.. ఆమె తన డిగ్రీని తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో పూర్తి చేయడం విశేషం. సినిమాల్లోకి రాకముందు తన కూచిపూడి నృత్య ప్రదర్శనలతో అలరించింది.కథానాయికగా రోజా నటించిన మొదటి చిత్రం ‘ప్రేమ తపస్సు’. ఈ చిత్రాన్ని దివంగత నటుడు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ డైరెక్ట్ చేసారు.
రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమాలో రోజా కథానాయికగా నటించింది. ఆ తర్వాత ఛాన్సులు లేక ఖాళీగా ఉంది. అదే సమయంలో పరుచూరి బ్రదర్స్.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో శోభన్ బాబు హీరోగా ‘సర్పయాగం’ సినిమాలో హీరో కూతురు పాత్రలో రోజా అలరించింది. ఈ సినిమా సక్సెస్‌తో రోజా వెనుదిరిగి చూసుకోలేదు.(file/Photo)
ఆ తర్వాత ‘సీతారత్నం గారి అబ్బాయి’ సినిమాతో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక చిరంజీవితో చేసిన ‘ముఠామేస్త్రీ’లో నటించింది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘భైరవ ద్వీపం’లో రాకుమారిగా ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్‌కు దూసుకుపోయింది. ఆ సినిమా తర్వాత రోజా వెనుదిరిగి చూసుకోలేదు. ఆపై తెలుగుతో పాటు దక్షిణాదిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది రోజా. (Twitter/Photo)
తమిళంలో రోజా .. తన భర్త సెల్వమణి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెంబరుతి’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాను తెలుగులో ‘చామంతి’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. తనను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు సెల్వమణినే ఆమె పెళ్లాడటం విశేషం. తన ప్రేమ విషయం ముందు రోజా వాళ్లింట్లో చెప్పి అక్కడ ఒప్పుకున్న తర్వాత రోజాకు చెప్పి ఒప్పించారు.
ప్రేమ గురించి చెప్పిన పదేళ్లకు ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇవివి సత్యనారాయణ ‘సీతారత్నం గారి అబ్బాయి’ సినిమా షూటింగ్లో ఉన్నపుడు సెల్వమణి తన ప్రేమ విషయం రోజాకు చెప్పారు. ఆమె ఒప్పుకుంది.. ఆ తర్వాత పదేళ్లకు అంటే 1992లో చెప్పి 2002లో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. వీళ్లకు ఇద్దరు పిల్లలున్నారు.. ఓ అమ్మాయి, అబ్బాయి.
ముఖ్యంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎంతో సినీ నటులు రాజకీయాల్లో ప్రవేశించి తమ లక్‌ను పరీక్షించుకున్నారు. అదే కోవలో రోజా కూడా తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసారు. అంతేకాదు చాలా మంది నటీనటులు పొలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందులో కొనసాగే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు.
2014, 2019 వరుసగా రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒక నటిగా ఉంటూ ఓ పారి ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆ తర్వాత పోటీ చేసిన రెండు ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేగా గెలిచింది. రాజకీయాల్లో ఓడిపోయినా.. ఎక్కడ కృంగిపోకుండా.. పట్టుదలతో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటూ రాజకీయాల్లో కొనసాగడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్గా రోజాది ఒక రికార్డు అనే చెప్పాలి. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న పార్టీ అధికారంలోకి రావడంతో ఆమెపై ఉన్న ఐరెన్ లెగ్ ముద్ర చెరిపేసుకున్నారు. (File)
ముందుగా మంత్రి పదవి ఆశించినా.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమెకు స్ఠానం దక్కలేదు. తాజాగా రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఆమె ఎట్టకేలకు మంత్రి పదవి లభించింది. ముందుగా ఆమెకు ‘ఏపీఐఐసీ’ చైర్మన్ పదవిని కట్టబెట్టారు ఏపీ సీఎం జగన్. ఆ పదవిలో ఎమ్మెల్యే రోజా నిన్న మొన్నటి వరకు కొనసాగారు. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే.. జబర్ధస్త్ వంటి కామెడీ షోలకు జడ్జ్‌గా వ్యవహిరిస్తూ ఇటు రాజకీయాలు, ఇటు టీవీ సినిమాల్లో దూసుకుపోతుంది. మంత్రి పదవి లభించిన తర్వాత జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పి ఒకింత భావోద్వేగానికి గురైంది. (Twitter/Photo)
ఇక మినిస్టర్ రోజా ఆస్తుల విషయానికొస్తే.. మొన్న ఎన్నికల సందర్భంగా సమర్ఫించిన ఎన్నికల అఫిడవిట్ విషయానికొస్తే.. రూ. 7 కోట్ల 38 లక్షలకు పైగా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే ఆమె భర్త సెల్వమణి పేరిట ఎలాంటి స్థిరాస్తులు లేవని స్పష్టం చేశారు. ఆమె కుమారుడు కృష్ణ కౌశిక్, కుమార్తె అన్షు మాలిక పేర్ల మీద రూ. 50 లక్షల 56వ ేల 191ల డిపాజిట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. (Twitter/Photo)
[caption id="attachment_1231952" align="alignnone" width="720"] ఇక 2019లో రోజా కార్ల విలువ.. రూ. 1,08,16,564 ఉంది. 2017-18 ఈమె ఆదాయ పన్నుశాఖకు రూ. 52.63,291 పన్నులు కూడా చెల్లించారు. ఈ కార్ల విలువ రూ.1,08,16,564లుగా చూపించారు. 2017-18లో ఆదాయ పన్ను శాఖకు రోజా రూ.52,63,291లు చెల్లించారు. (Twitter/Photo)
మినిష్టర్ రోజా భర్త సెల్వమణి పేరుతో ఉన్న ఆస్తులు విషయానికొస్తే.. ఆమె భర్త పేరు మీద ఎలాంటి స్థిరాస్థులు లేవు. చరాస్థి విషయానికొస్తే.. 58,02,953 ఉంది. అప్పులు రూ. 22 లక్షల దాకా అప్పులున్నాయి. దాంతో పాటు హైదరాబాద్, చిత్తూరు, చైన్నెలో కూడా సొంత ఇళ్లులున్నాయి. ఇక తల్లిదండ్రులు ఇతరులు పేర్లు మీద ఇళ్లు పొలాలున్నాయి. వాటన్నింటినీ కలిపితే దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఏమైనా సినీ రంగంలో ఉంటూ దక్షిణాదిలో జయలలిత తర్వాత ఇన్ని దక్కా మొక్కీలు తిని మంత్రిగా స్థానం సంపాదించిన రోజా ముందు ముందు రాజకీయంగా ఎలాంటి ఉన్నత స్థానం పొందుతుందో చూడాలి. (Twitter/Photo)