ఒకప్పుడు టాలీవుడ్‌ని ఏలిన హీరోయిన్లలో రోజా ఒకరు. స్టార్ హీరోలందరి సరసన నటించిన రోజా.. ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా.. రాను రాను సినిమాలను తగ్గించుకుంటూ వచ్చారు. తాజాగా తన సమయాన్ని పూర్తిగా రాజకీయాలకే కేటాయించింది. రీసెంట్గా వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో పర్యాటక శాఖ మంత్రి అయ్యారు. ఈమెకు ఆర్ఆర్ఆర్ సినిమాలో కథానాయికగా నటించిన ఆలియా భట్‌కు రిలేషన్ ఉంది. (Twitter/Photo)
రోజా మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు చిన్ని తెరపై జబర్దస్త్, బతుకు జట్కా బండి వంటి పలు షోలల్లో పార్టిసిపేట్ చేసేవారు. ఇదిలా ఉంటే రోజా అంటే ఇప్పటికీ చాలా మంది అభిమానులున్నారు. నటిగా రోజా విషయానికొస్తే.. తెలుగు,తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన రోజా.. కన్నడ, మలయాళంలో ఓ మోస్తరు చిత్రాల్లో నటించి మెప్పించింది. (File/Photo)
ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు విజయశాంతి తర్వాత లేడీ ఓరియంటెడ్ పాత్రలతో అలరించింది రోజా. ఇక హీరోయిన్గా ఫేడౌట్ అయ్యాకా.. రోజా.. తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత టీడీపీ టికెట్ పై పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఆ తర్వాత వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా తొలిసారి ఏపీ శాసనసభలో అడుగుపెట్టారు.
అప్పట్లో ఆమె ప్రాతినిథ్యం వహించిన వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆమెను అందరు ఐరెన్ లెగ్ అని ట్రోల్ చేసారు. ఇక 2019 ఎన్నికల్లో రెండోసారి రోజా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈమెపై ఉన్న ఐరెన్ లెగ్ ముద్ర చెరిగిపోయింది. తాజాగా ఇపుడు మంత్రి కూడా అయ్యారు. ఒక రకంగా జయలలిత తర్వాత ఈ స్థాయిలో రాష్ట్ర రాజకీయాల్లో దక్షిణాదిలో చక్రం తిప్పినవారు రోజానే అని చెప్పాలి. (Twitter/Photo)
దాదాపు మూడు దశాబ్దాల కెరీర్లో ఎన్నో సౌత్ చిత్రాల్లో నటించిన రోజా.. తన కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క హిందీ చిత్రంలో నటించింది. ఇక రోజా హిందీ చిత్ర విషయానికొస్తే.. ఈమె హిందీలో ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా నటించిన ‘ది జెంటిల్మెన్’ సినిమాలో ఐటెం సాంగ్‌లో మెరిసింది రోజా.
[caption id="attachment_1318642" align="alignnone" width="1200"] ఈ సినిమా తమిళం, తెలుగులో శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జెంటిల్మెన్’ సినిమాకు రీమేక్. తెలుగులో ప్రభుదేవా చేసిన ‘చికుబుకు రైలే’ పాటను హిందీలో చిరంజీవే చేసారు. సౌత్‌లో గౌతమి ఐటెం సాంగ్‌లో మెరిస్తే.. హిందీలో రోజా ఐటెం సాంగ్‌లో చిందేసింది.
అంతకు ముందు రోజా.. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘రక్షణ’ సినిమాలో ఓ ఐటెం పాటలో మెరిసింది. ఆ తర్వాత ‘హలో బ్రదర్’లో కూడా ఓ పాటలో మెరిసింది. మొత్తంగా హిందీలో రోజా నటించిన ఏకైక చిత్రంగా ‘ది జెంటిల్మెన్’ సినిమా నిలిచిపోయింది. ఈ రకంగా ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఆలియా భట్.. తండ్రి దర్శకుడు మహేష్ భట్‌తో రోజాది.. ఒక దర్శకుడు, నటికున్న రిలేషన్ మాత్రమే కానీ వేరే ఏమి లేదు. రోజా హిందీలో పూర్తి స్థాయి పాత్రలో కాకుండా..ఐటెం పాటలో రోజా మెరవడం విశేషం. ఇక ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ సక్సెస్‌లో ఉండగానే.. తన తోటి హీరో రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. (Twitter/Photo)