Jackson: సిల్వర్ స్క్రీన్‌పై కింగ్ ఆఫ్ పాప్ జీవితం! మైఖేల్ జాక్సన్ పాత్రలో ఎవరో తెలుసా?
Jackson: సిల్వర్ స్క్రీన్‌పై కింగ్ ఆఫ్ పాప్ జీవితం! మైఖేల్ జాక్సన్ పాత్రలో ఎవరో తెలుసా?
Jackson: పాప్ ప్రపంచంలో మైఖేల్ జాక్సన్ ఒక సంచలనం. ఆయన ఈ లోకాన్ని విడిచి ఎన్నో ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన పేరు వింటే చాలు నరాల్లో డాన్స్ తాండవం చేస్తుంది. ఇక ఈ పాప్ కింగ్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మైఖేల్ జాక్సన్ అంటే తెలియని వారుండరు. ఆయన కేవలం పాటలతోనే కాకుండా తన మూన్ వాక్ డ్యాన్స్‌తో ట్రెండ్ క్రియేట్ చేశారు. పాటలు పడుతూనే అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన మొదటి సింగర్ మైఖేల్ జాక్సన్.
2/ 9
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైఖేల్ ప్రధాన పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని జీకే స్టూడియోస్ స్పష్టం చేసింది.
3/ 9
పాప్ ప్రపంచంలో మైఖేల్ జాక్సన్ ఒక సంచలనం. ఆయన ఈ లోకాన్ని విడిచి ఎన్నో ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన పేరు వింటే చాలు నరాల్లో డాన్స్ తాండవం చేస్తుంది. ఇక ఈ పాప్ కింగ్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.
4/ 9
ఈ చిత్రానికి ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించనున్నారు. గ్రాహం కింగ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. జాఫర్ చాలా కాలంగా మైఖేల్ పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు.
5/ 9
చిన్న వయసు నుంచే మైఖేల్ జాక్సన్‌ను స్టైల్‌ను ఫాలో అవుతున్నాడు జాఫర్. అందుకే వాకింగ్ స్టైల్ ఒక్కటే కాకుండా వాయిస్ కూడా అచ్చం మైఖేల్‌ని పోలి ఉంటుందంట.
6/ 9
ప్రపంచ సంగీతాన్ని శాసించిన సంగీత చక్రవర్తిగా పేరు సంపాదించుకున్న కింగ్ ఆఫ్ పాప్ జాక్సన్.. ప్రపంచాన్ని తన పాటలతో రకరకాల స్టెప్పులతో ఉర్రూతలూగించారు.
7/ 9
జాక్సన్ పూర్తి పేరు మైఖేల్ జోసెఫ్ జాక్సన్. ఆగష్టు 29, 1958 ఆయన జన్మించారు. జూన్ 25 2009న మరణించాడు. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో రాణించాడు.
8/ 9
అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్ల జాతి సింగర్ జాక్సన్. చరిత్రలో నిలిచిపోయేలా అందరి మనసుల్ని ఆక్రమించారు జాక్సన్.
9/ 9
జాక్సన్ మొత్తం 13 గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. ఇక మైఖేల్ జాక్సన్ బయోపిక్ న్యూస్ చాలా రోజుల నుంచి వైరల్ అవుతుండగా తాజాగా జాక్సన్ బయోపిక్ తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు మేకర్స్. మరీ ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే.