Mehreen Pirzada : మెహ్రీన్.. తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అంతే కాకుండా మెహ్రీన్‌కు మంచి నటి అని పేరోచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది. ఆమె ప్రస్తుతం వరుణ్ సరసన ఎఫ్ 3లో నటిస్తోంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ తమన్నా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. Photo : Instagram