Mehreen pirzada : మెహ్రీన్.. తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ యేడాది ఈ భామ ‘ఎఫ్ 3’ మూవీతో మరో సక్సెస్ అందుకుంది. కానీ ఈ సినిమా సక్సెస్ అయినా.. ఈ భామకు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. (Instagram/Photo)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ మూవీ మెహ్రీన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్నీ భాగానే అలరించింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2' మూవీతో మరో హిట్ అందుకుంది. ఈ యేడాది ‘ఎఫ్ 3’ మూవీతో హిట్ అందుకుంది. (Instagram//Photo)
మెహ్రీన్ కౌర్ 5 నవంబర్ 1993లో పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో జన్మించింది. ఈమె తమ్ముడు కూడా మోడల్ నటుడు. అంతేకాదు చిన్నపుడే మోడలింగ్‌లో అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత నటిగా మారింది. మెహ్రీన్ కౌర్ తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫోటోలను బాగా పంచుకుంటుంది. (Instagram/Photo)
మెహ్రీన్ కౌన్.. తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో ఈ భామనే ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా విషయమై త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో సోనాక్షి సిన్హాను ఫైనలైజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి తనకు వరుస అవకాశాలిస్తోన్న అనిల్ రావిపూడి ఈ సినిమాలో మరో కథానాయికగా ఛాన్స్ దొరకకపోతుందా అని మెహ్రీన్ ఎదురు చూస్తోంది. (Instagram/Photo)