మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో‘వేదాలం’ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. దాంతో మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. అంతేకాదు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. అందుకే తను చేయబోయే దర్శకులతో చిరంజీవి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. (Twitter/Photo)
బాబీ (కే.యస్.రవీంద్ర) జై లవకుశ, వెంకీ మామ లాంటి సినిమాలతో స్టార్ హీరోలను తాను బాగానే హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్న బాబీ.. చిరంజీవి కోసం కథను రెడీ చేసాడు. ఈయన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మెగాస్టార్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. పూర్తిగా కామెడీ జోనర్లో ఈ సినిమా ఉండబోతునేది సమాచారం. (Twitter/Photo)
ప్రశాంత్ వర్మ: అ.. సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకుని ఆ తర్వాత ‘కల్కి’తో పర్లేదు అనిపించుకున్న కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా చిరంజీవితో సినిమా చేయాలని చూస్తున్నాడు. మెగాస్టార్‌కు కథ చెప్పాలని ట్రై చేస్తున్నాడు ఈయన. అన్నీ అనుకున్నట్లు జరిగితే చిరంజీవికి అదిరిపోయే కథ చెప్తానంటున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ‘జాంబీ రెడ్డి’ సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.
వీళ్ళతో పాటు పరశురామ్, హరీష్ శంకర్ లాంటి కుర్ర దర్శకులు చెప్పిన కథలు కూడా విన్నాడు మెగాస్టార్. వీరిలో కొరటాల శివ తర్వాత మోహన్ రాజా, మెహర్ రమేష్, బాబీ సినిమాలను అఫీషియల్‌గా ప్రకటించారు. మిగతా దర్శకుల సినిమాలు ఎపుడు పట్టాలెక్కుతాయో చూడాలి. మొత్తంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవి వరస సినిమాలతో దుమ్ము దులిపేయాలని ఫిక్సైపోయాడు చిరంజీవి.