ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పదం 'సినీ పెద్దలు'. ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళినప్పుడు కూడా 'సినీ పెద్దలు' వెళ్తున్నారని మీడియా కూడా రాస్తుంది. మరోవైపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెళ్లి సినీ పెద్దలకు చెప్పుకోండి అంటూ కొందరు మీడియా ముందు కామెంట్ చేస్తున్నారు. అయితే ఆ సదరు 'సినీ పెద్దలు' ఎవరు అనే విషయం మాత్రం ఎవరూ క్లారిటీగా చెప్పడం లేదు.
మా అసోసియేషన్ అనేది అందరి సొంతం అని.. అక్కడ కొన్ని కుటుంబాలు మాత్రమే నిలబడాలా.. ఇంకెవరూ రాకూడదా.. ఎప్పుడూ వాళ్లే ఉండాలా అందుకే తానొచ్చానంటున్నాడు. తనకు సొంతిళ్లు ఇక్కడే ఉందని.. ఆధార్ కార్డు ఇక్కడే ఉందని.. పోటీ కూడా చేస్తానంటున్నాడు ఈ నటుడు. మొత్తానికి మా ఎన్నికలు అయ్యేంతవరకు ఈ వేడి తగ్గకపోవచ్చు.