మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆయన నటించిన రెండో సినిమా కొండపొలం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ను అభినందించారు. .. Photo : Twitter
ఇక కొండపొలం కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేసినట్టు క్రిష్ మీడియాకు తెలిపారు. Photo : Twitter
‘కొండపొలం’ సినిమా చూసి మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అంతేకాదు చిరంజీవి మంచి కథ ఉంటే.. క్రిష్‌తో నెక్ట్స్ సినిమా చేయడానికి రెడీ అంటున్నారు. త్వరలో వీళ్ల కాంబినేషన్ సెట్స్ పైకి వెళితే చూడాలనుకునే అభిమానులున్నారు. క్రిష్.. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరి హర వీరమల్లు’ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)