Chiranjeevi - Waltair Veerayya Theatrical Business Details | మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. బాబీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..
ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్లో *వాల్తేరు వీరయ్య’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యా.యి. శ్లోక ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకు అక్కడ రిలీజ్ చే'స్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ జనవరి 12 వేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే అక్కడ ఓవర్సీస్లో ఈ సినిమా బుకింగ్స్ హాఫ్ మిలియన్‌కు చేరువలో ఉంది. మొదటి రోజు ఓవర్సీస్లో వన్ మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసే అవకాశాలున్నాయి. Photo : Twitter
వాల్లేరు వీరయ్య సినిమాను యూఎస్‌లో అత్యధిక లోకేషన్స్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకానున్నట్లు ప్రకటించడంతో ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో అదే టైటిల్‌తో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే హిందీలో విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
వాల్తేరు వీరయ్యలో రవితేజ విక్రమ్ సాగర్ అనే పోలీస్ ఆఫీసర్‌గా విశాఖకు కమిషనర్‌గా ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఇతను తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి పాత్రలో నటిస్తే.. చిరు.. వాల్తేరు ప్రాంతానికి చెందిన వీరయ్యగా కనిపించనున్నారు.అంతేకాదు ఇటీవల రవితేజకు సంబంధించిన టీజర్ విడుదలై కేక పెట్టించింది. తెలంగాణ యాసలో ఆయన వావ్ అనిపించారు.
తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..తెలంగాణ (నైజాం)లో .. రూ. 18 కోట్లు.. రాయలసీమ (సీడెడ్)లో.. రూ. 15 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 10.2 కోట్లు.. తూర్పు గోదావరి.. రూ. 6.50 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 6.50 కోట్లు.. గుంటూరు.. రూ. 7.50 కోట్లు.. కృష్ణ.. రూ. 5.6 కోట్లు.. నెల్లూరు..రూ. 3.2 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 72 కోట్లు.. కర్ణాటక .. రూ. 5 కోట్లు.. రెస్టాఫ్ భారత్.. రూ. 2 కోట్లు.. ఓవర్సీస్లో రూ. 9 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 89 కోట్లు రాబట్టాలి. (Twitter/Photo)
ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరు వీరయ్య, విజయ్ వారసుడు, అజిత్ తెగింపు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే అజిత్ ‘తెగింపు’ విడుదలై తెలుగులో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. తమిళంలో విజయ్ ’వారిసు’ విడుదలై మంచి టాకే సొంతం చేసుకుంది. వీరసింహారెడ్డి మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సంక్రాంతి పోరులో ఏ సినిమా పండుగకు విజేతగా నిలవనుందో..
ఇక అది అలా ఉంటే ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. 'నువ్వు శ్రీదేవైతే నేను చిరంజీవి అవుతా' అంటూ సాగే ఈ పాట మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. దాంతో పాటు కాసేటికి క్రితమే విడుదలైన నీకేమే అందం ఎక్కువ.. నాకేమో తొందరెక్కువ లిరికల్ సాంగ్‌ను 2మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. Photo : Twitter
ఈ సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్లో కనిపించనున్నారా లేదా అనేది చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటంచారు. రవితేజ, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మరి సంక్రాంతి బరిలో చిరంజీవి విజేతగా నిలుస్తారా లేదా అనేది చూడాలి. Photo : Twitter