చిరంజీవి భోళా శంకర్ తెలుగు న్యూస్, చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, ఆచార్య మూవీ నుంచి అదిరిపోయే గిఫ్ట్, రామ్ చరణ్ తేజ్" width="1600" height="1600" class="size-full wp-image-1101126" /> మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నాడు. ఈయన అరడజన్ సినిమాలకు పైగానే కమిట్ అయ్యాడు. అందులో మూడు సినిమాల షూటింగ్స్ ఒకేసారి జరుగుతున్నాయి కూడా. పైగా అందులో ఆచార్య అయిపోయింది. ఈ సినిమా ఫిబ్రవరి 4, 2022న విడుదల కానుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రామ్ చరణ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ చిత్రంతో పాటు మరో మూడు సినిమాలు చేస్తున్నాడు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ భోళా శంకర్.. లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్.. బాబీ దర్శకత్వంలో సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పైనే ఉన్నాయి. ఇవి కాకుండా వెంకీ కుడుములకు ఓ సినిమా సైన్ చేసాడు చిరంజీవి. ఈ సినిమాలన్నీ వీలైనంత తక్కువ బడ్జెట్లోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు చిరంజీవి.
మరీ ముఖ్యంగా గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు చిరంజీవి బడ్జెట్ కాకుండా కేవలం 25 కోట్లలోపే పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలో నటులు కూడా అప్‌కమింగ్ వాళ్ళనే తీసుకుంటున్నారు. చిరంజీవి కూడా కొత్త వాళ్ళకు ఛాన్సులు ఎక్కువగా ఇస్తున్నాడు. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు పిలిచి మరి ఛాన్సులు ఇస్తున్నాడు చిరంజీవి. తాజాగా బోళా శంకర్ సినిమాలో కమెడియన్ లోబోకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు మెగాస్టార్.