చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, బన్ని.. ఏ హీరోలకు లేని ప్రత్యేకత వీళ్లకు మాత్రమే ఉంది. ఈ హీరోలకు ఓన్‌గా తమకంటూ సొంత విమానాలున్నాయి. మన సినిమా స్టార్స్.. ఖరీదైన అద్దాల మేడల్లో ఉంటారు. అంతేకాదు పడవల్లాంటి కార్లలో తిరుగుతుంటారు. అంతకు మించి విలువైన గాడ్జెట్స్ వాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అందులో కొంత మంది టాలీవుడ్ హీరోలు సొంతంగా విమానాలు కొనే స్థాయికి ఎదిగారు. మన టాలీవుడ్లో కొంత మంది హీరోలకు మాత్రమే స్వంత విమానాలున్నాయి. (Twitter/Photos)
వీళ్లు ఈ జెట్ విమానాలను.. తమకు దగ్గరలో గల ఎయిర్‌పోర్ట్‌లో పార్క్ చేసి ఉంచుతారు. అక్కడ ఉన్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది దీని మెయింటెన్స్‌తో చూసుకుంటూ ఉంటారు. దాని కోసం ఆయా ప్రైవేటు విమానాల యజమానాలతో ఒప్పందం కూడా చేసుకుంటారు. అంతేకాదు వేరే వాళ్లకు సైతం ఆయా విమానాశ్రయ సిబ్బంది రెంట్ బేసిస్‌లో ఈ విమానాలు ఇస్తుంటారు. (File/Photos)