Chiranjeevi Dual Roles | చిరంజీవి తన 43 ఏళ్ల కెరీర్లో దాదాపు 150కి పైగా సినిమాల్లో విభిన్న పాత్రల్లో అలరించారు. అందులో కొన్ని సినిమాల్లో ఒకటి కంటే రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేసారు. ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో మాత్రం త్రిపాత్రాభినయం చేసారు. మొత్తంగా మెగాస్టార్ తన కెరీర్లో ఒకటి కంటే ఎక్కువ పాత్రల్లో నటించిన సినిమాల విషయానికొస్తే.. (Twitter/Photo)
యముడికి మొగుడు | యముడికి మొగుడు సినిమాలో కాళీ, బాలుగా రెండు పాత్రల్లో మెప్పించిన చిరంజీవి. ఒక పాత్రను చిత్రగుప్తుడు చంపేస్తే.. అప్పటికే చనిపోయిన మరో చిరంజీవి శరీరంలో కాళీ పాత్ర ఆత్మను ప్రవేశ పెడతారు. రవిరాజా పినిశెట్టి తెరకెక్కించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ‘యమగోల’ స్పూర్తిగా తెరకెక్కించారు. (Youtube/Credit)
ముగ్గురు మొనగాళ్లు |‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో పృథ్వీ,విక్రమ్, నటరాజ రామకృష్ణ దత్తాత్రేయగా మూడు పాత్రల్లో తొలిసారి త్రిపాత్రాభినయంలో ఒదిగి పోయిన మెగాస్టార్ చిరంజీవి.. కే.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో నాగబాబు,పవన్ కళ్యాణ్ నిర్మించారు. (Youtube/Credit)
అందరివాడు | ‘అందరివాడు’లో తండ్రి కొడుకులుగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేసారు. ఇందులో తండ్రీ గోవింద రాజులు.. తనయుడు సిద్ధార్ధ్ పాత్రలో చిరంజీవి ఇరగదీసాడనే చెప్పాలి. ముఖ్యంగా తండ్రీ గోవిందరాజులు పాత్రనే ఈ సినిమాకు హైలెట్. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Youtube/Credit)
‘ఖైదీ నంబర్ 150’లో మరోసారి రెండు పాత్రల్లో మెప్పించిన చిరంజీవి..చిరంజీవి తన రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో చిరంజీవి కత్తి శీనుగా.. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే రియల్ నేమ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా వచ్చిన ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ ను నమోదు చేసింది. (Youtube/Credit)