గాడ్ ఫాదర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వాల్తేరు వీరయ్య’లో కీలక పాత్రలో రవితేజ నటించడానికి ఓకే చెప్పాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. అంతేకాదు చిరంజీవితో కాంబినేషన్ సీన్స్ చేయడానికీ డేట్స్ కూడా ఇచ్చాడట. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. (Twitter/Photo)
చిరంజీవి బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా కూడా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. పూర్తి మాస్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో శృతి హాసన్ జాయిన్ అయింది. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటించాడానికి ఓకే చెప్పారు. Mega 154 Twitter
అయితే తాజాగా వాల్తేరు వీరియ్య రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు వీరయ్య రాకకి సంక్రాంతిలో డేట్ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ జనవరి 13న రిలీజ్ చేసేందుకు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.
వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి బాబీ సింహా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నేషనల్ అవార్డు విన్నర్ అయిన బాబీ సింహా ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వదిలిన ఆయన పవర్ఫుల్ లుక్ మెగా ఫ్యాన్స్‌కి కిక్కిచ్చింది.
మాస్ కమర్షియల్ అంశాలు ఫుల్లుగా ఉండేలా ఈ మెగా 154 కథ ఉండనుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ పుట్ కోసం యూనిట్ అంతా శ్రమిస్తోందట. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజ్ రవితేజ కూడా నటిస్తున్నారు.
ఈ సినిమాలో యాక్ట్ చేక్ట్ చేయడానికి రవితేజకు ఒక్కో రోజుకు రూ. 25 లక్షల చొప్పున పారితోషకం ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రవితేజ పాత్రలను 7 నుంచి 10 రోజుల్లో కంప్లీట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రవితేజకు ఈ సినిమాకు రూ. 1.75 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల వరకు పారితోషకం అందుకునే అవకాశం ఉంది. (File/Photo)
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి- రవితేజ మాస్ సాంగ్ కూడా ప్లాన్ చేశారట. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2023 జనవరి 11వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. దీంతో ఇప్పుడు మెగా అభిమానులు ఇప్పుడు వాల్తేరు వీరయ్య కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్లో కనిపించనున్నారట. అందులో భాగంగానే శృతిహాసన్‌తో పాటు ఒకప్పటి నటి సుమలత కూడా నటించనున్నారని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం చిరంజీవి యూరప్ వెళ్లనున్నారని తెలుస్తోంది. యూరప్‌లోని మాల్టా దేశంలో 20 రోజుల పాటు షూట్ చేయనున్నారట టీమ్. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట..