మెగా తండ్రీ తనయులైన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా పూర్తి స్థాయిలో తొలిసారి నటించిన ’ఆచార్య’ మొదటి రోజు మొదటి ఆట నుంచే ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉండటంతో మెగాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శని వారంతో పాటు ఆది వారం కూడా ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. సోమ వారం 4వ రోజుతో ఈ సినిమా కలెక్షన్లు చూసి అందరు ఆశ్యర్యపోతున్నారు. ఇక 5వ రోజు మాత్రం ఈ సినిమా కాస్త బెటర్ అనేలా కలెక్షన్లు వచ్చాయి. Acharya Twitter
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. ఆచార్య డివైడ్ టాక్‌కు కూడా అన్నే కారణాలున్నాయంటున్నారు ప్రేక్షకులు. తెలంగాణలో ఇప్పటికే టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. పైగా అదనంగా మరో రూ. 50 రూపాయలు పెంచడం.. మరోవైపు 10Th Class ఎగ్జామ్స్ కూడా ఉండటంతో కొన్ని ఫ్యామిలీలు థియేటర్స్ వైపు అసలు చూడటం లేదు. ఇవన్ని కూడా ఈ సినిమా కలెక్షన్స్ పై తీత్ర ప్రభావం చూపించాయి.
ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర సినిమాలో సగం ఉంటోంది. ఇద్దరు నటన పరంగా బాగానే ఉన్న.. కథ, కథనం సరిగా లేకపోవడంతో ఈ సినిమా తేలిపోయింది.
కథ లేకుంటే ఇద్దరు క్రౌడ్ పుల్లర్ స్టార్స్ ఉన్న సినిమాను కాపాడలేదనే విషయం మరోసారి ఆచార్య రిజల్డ్తో స్పష్టమైంది. ఈ సినిమా ఏప్రిల్ 29 ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. అంతేకాదు 132.50 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 29.50 కోట్లు రాబట్టింది. రెండో రోజు రూ. 5.15 కోట్లు రాబడితే.. మూడో రోజు ఆది వారం.. రూ. 4.07 కోట్లు మాత్రమే వస్తే.. నాల్గో రోజు.. ఈ సినిమాకు రూ. 53 లక్షలు మాత్రమే రాబట్టి బాక్సాఫీస్‌ను నిరాశ పరిచింది. ఐదో రోజు .. ఈ సినిమా 82 లక్షలు మాత్రమే రాబట్టింది.
మొత్తంగా నాల్గో రోజు కంటే ఐదో రోజు పబ్లిక్ హాలిడే కావడం వల్ల కాస్త బెటర్‌గా కలెక్షన్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా రూ. 82 లక్షల షేర్ (రూ. 1.40 కోట్లు గ్రాస్) మాత్రమే రాబట్టి ట్రేడ్ పండితులను సైతం ఆశ్యర్యపోయేలా చేసింది. ఓవర్సీస్ ప్లస్ మిగతా ఏరియాల్లో కలిపితే.. రూ. 32 లక్షలు షేర్ వచ్చింది. మొత్తంగా ఐదో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.90 కోట్లు (రూ. 1.35 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. (Twitter/Photo)
ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ): రూ. 12.14 కోట్లు / రూ. 38కోట్లు సీడెడ్ (రాయలసీమ): రూ. 6.06కోట్లు / రూ. 18.50 కోట్లు ఉత్తరాంధ్ర: రూ. 4.81కోట్లు / రూ. 13 కోట్లు ఈస్ట్: రూ. 3.22 కోట్లు / రూ. 9.50 కోట్లు వెస్ట్: రూ. 3.36 కోట్లు / రూ. 7.02 కోట్లు గుంటూరు: రూ. 4.56 కోట్లు / రూ. 9 కోట్లు కృష్ణా: రూ. 3.00కోట్లు / రూ. 8 కోట్లు నెల్లూరు : రూ. 2.92 కోట్లు / రూ. 4.30 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 40.07 కోట్లు / రూ. 107.50 కోట్లు కర్ణాటక + రెస్టాఫ్ భారత్ : రూ. 2.65 కోట్లు / రూ. 9 కోట్లు ఓవర్సీస్ : రూ. 4.60 కోట్లు / రూ. 12 కోట్లు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రూ. 47.32 కోట్లు (రూ. 73.90 కోట్ల గ్రాస్) / రూ. 131.20 కోట్లు షేర్ రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ. 132.50 కోట్ల షేర్ రాబట్టాలి. (Twitter/Photo)
మొత్తంగా 5రోజుల్లో ఈ సినిమా రూ. 47.32 కోట్ల షేర్ (రూ. 73.90 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 85.18 కోట్లను రాబడితే కానీ బ్రేక్ ఈవెన్ పూర్తి కాదు. ఇపుడున్న పరిస్థితుల్లో ఆచార్య బ్రేక్ ఈవెన్ పూర్తి కావడం దాదాపు అసాధ్యమే. ఓవరాల్‌గా ఈ సినిమా 80 కోట్లకు పైగా బయ్యర్స్‌కు నష్టాలు తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా సోనూ సూద్ నటించారు. ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. (Twitter/Photo)