గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. అంతేకాదు సీఎం జగన్ తీసుకున్న పలు నిర్ణయాలను కూడా స్వాగతించారు. ఆ మధ్య ఏపీ సీఎం కర్నూలు ఎయిర్ పోర్ట్కు మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా పేరు పెట్టడంతో పాటు పలు అంశాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను మెచ్చుకున్నారు. (Twitter/Photo)
‘నేను ఇండస్ట్రీ పెద్ద కాదు.. నాకు అవ్వాలని కూడా లేదు.. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు.. కానీ బాధ్యతగా ఉంటా.. అవసరం అనుకున్నపుడు కచ్చితంగా ముందుకొచ్చి అండగా ఉంటానన్నారు. కానీ చిరు మాత్రం ఇండస్ట్రీ పెద్దగా కాకుండా.. ఇండస్ట్రీ బిడ్డగా ఏపీ సీఎం జగన్ను కలిసినట్టు చెప్పుకొచ్చారు.
తెలంగాణలో టికెట్ రేట్స్ ఇష్యూ గురించి ప్రభుత్వానికి లేఖ రాసింది ముందుగా చిరంజీవే. ఆయన స్పందించిన తర్వాతే మిగిలిన వాళ్లు అడిగారు. ఆ తర్వాత టికెట్ రేట్స్ కూడా పెంచుతూ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితుల గురించి కూడా ఆయన ముఖ్యమంత్రి జగన్తో చర్చించడానికి సిద్ధమయ్యారు. జగన్ కూడా చిరంజీవి పలు అంశాలపై సానుకూలంగా స్పందించారని చిరు చెప్పుకొచ్చారు. (Twitter/Photo)
తాజాగా తెలుగు ఇండస్ట్రీ తరుపున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడంపై తెలుగు సినీ ఇండస్ట్రీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఈ విషయమై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతలు మాట్లాడుతూ.. చిరంజీవి, ఏపీ సీఎం భేటి అవుతున్నారనే విషయం తమకు తెలియదన్నారు. ఈ విషయమై TFCC వైస్ ప్రెసిడెండ్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. ఆయన తనకున్న పరిచయాలతో ఆయన్ని కలవగలిగారు. ఆయన ఏపీ సీఎంను కలిసే ముందు తెలుగు ఫిల్మ్ చాంబర్ వాళ్లను సంప్రదిస్తే బాగుండేదన్నారు. (Twitter/Photo)
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎపుడు ఒక్కటిగా లేదనే దానికి స్పందిస్తూ రాందాస్ .. ఇండస్ట్రీలో రకరకాల ప్రాంతాల వారున్నారు. వీళ్లను సినిమా అనే కళామతల్లి కలిపి ఉంచతోందన్నారు. చిరు ఆయన తన సినిమా కోసం జగన్ను కలిసారా లేదా ఇండస్ట్రీ సమస్యల గురించి వెళ్లి మీట్ అయ్యారా అనేది మాకు తెలియదు. ఇండస్ట్రీ బాగు కోసం ఏ నిర్ణయం తీసుకున్న మాకు సమ్మతమే అన్నారు. (File/Photo)
ఏపీ ముఖ్యమంత్రి జగన్తో చిరంజీవి భేటి కావడం పై ఆయన వ్యక్తిగతం అంటూ నిర్మాతల కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ అన్నారు. ఇండస్ట్రీలో ఎవరు ఆర్గనేషన్ కన్న పెద్దవాళ్లు కాదంటూ చిరుపై పరోక్ష విమర్శలు చేశారు. సినీ రంగంలోకి ఎంతో మంది వస్తుంటారు.. పోతుంటారు. కానీ ఆర్గనైజేషన్ మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుందన్నారు. ఒకప్పటి హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి హీరోల కూడా తాము ఇండస్ట్రీ పెద్దలని చెప్పుకోలేదున్నారు. ఇండస్ట్రీకి నిర్మాతలే పెద్దదిక్కు. వాళ్లే ఇండస్ట్రీలోని అందరితో సమన్వయం ఉండేది వాళ్లకే అన్నారు. చిరు ఆయన పర్సనల్ ఎజెండా కలిసి వెళ్లినట్టు కనిపిస్తోందన్నారు. (File/Photo)
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తనపై కక్ష్యతో ఏపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని చెప్పి ఏపీ ప్రభుత్వంతో ప్రత్యక్ష యుద్దానికి దిగారు. ఏనీలో టిక్కెట్ల అమ్మకంలో పారదర్శకత లేదంటున్నారు. అసలు ప్రభుత్వం అమ్మతున్న మద్యం అమ్మాకాల్లో పారదర్శకత ఉందా ఉంటే ఎందుకు అన్ని సార్లు కోర్టులు చుట్టు తిరుగుతున్నారాని ప్రశ్నించారు. అంతేకాదు ప్రభుత్వం పంతానికి పోతే ఏపీలో తన సినిమాలు ఉచితంగా ఆడిస్తాననంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు.. ఏపీ ఆరోగ్యానికి వైసీపీ హానికరం అంటూ ఘాటుగానే విమర్శించారు. మొత్తంగా ఏపీలో తమ్ముడు పవన్ కళ్యాణ్... వైపీసీ ప్రభుత్వం కయ్యానికి దిగితే.. అన్నయ్య చిరంజీవి మాత్రం నెయ్యంతో నెగ్గుగురావాలన చూస్తున్నారు. (Twitter/Photo)