Khaidi No 150 : మెగాస్టార్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘ఖైదీ నంబర్ 150’. దాదాపు 10 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా వెండితెరపై అదే జోరును చూపించారు. అంతేకాదు తన యాక్టింగ్, డాన్సింగ్‌లో అదే జోరును చూపించారు. ఇక పదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవిని చూడడానికి అభిమానులతో పాటు సామాన్య జనాలు థియేటర్స్‌కు క్యూ కట్టారు. ఈ సినిమా 2017 జనవరి 11న విడుదలైన అద్భుతమైన విజయాన్ని సాధించింది. (Twitter/Photo)
కృషి ఉంటే మనుషులు మెగాస్టార్ అవుతారనేదానికి ‘ఖైదీ నంబర్ 150’ నిదర్శనం. ఈ మూవీ ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్యర్యపోయారు. ఈ సినిమాకు అప్పట్లోనే మొదటి రోజు.. రూ. 40 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి హీరోగా మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించింది. అంతేకాదు రీ ఎంట్రీలో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటతో మరోసారి బాక్సాఫీస్‌ను కుమ్మి పడేసారు చిరంజీవి. (Twitter/Photo)
2007లో ప్రభుదేవా దర్శకత్వంలో ‘శంకర్ దాదా జిందాబాద్’ మూవీలో చిరంజీవి హీరోగా కనిపించారు. ఈ చిత్రం హిందీలో సంజయ్ దత్ హీరోగా నటించిన ‘లగే రహో మున్నాభాయ్’ మూవీకి సీక్వెల్. అంతకు ముందు సంజూ బాబా నటించిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సినిమాను చిరు.. తెలుగులో ‘శంకర్ దాదా MBBS’గా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘శంకర్ దాదా జిందాబాద్’ మాత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. (Twitter/Photo)
‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత చిరంజీవి ‘ప్రజా రాజ్యం’ అనే పార్టీ పెట్టి రాజకీయాల్లో వెళ్లడం.. ఉమ్మడి ఏపీలో 2009లో జరిగిన ఎన్నికల్లో 18 సీట్లు గెలిచారు. చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనూహ్యంగా పాలకొల్లు నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ క్యాబినేట్లో టూరిజం మినిష్టర్‌గా చేసారు. ఆ తర్వాత షరా మాములే.. ఈ గ్యాప్‌లో చిరంజీవి.. తన తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’తో పాటు బ్రూస్లీ సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసారు. (Twitter/Photo)
రాజకీయాల్లో అంతగా రాణించలేకపోయినా చిరంజీవి.. పోయిన చోటనే వెతుక్కోవడం అన్నట్టు 2016లో హీరోగా తనకు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన సినిమా ఇండస్ట్రీనే నమ్ముకున్నారు. అంతేకాదు హీరోగా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్టు చెప్పారు. మధ్యలో పూరీ జగన్నాథ్‌తో ‘ఆటో జానీ’ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఈ సినిమా సెకండాఫ్ అంతగా బాగోలేదని చెప్పి పూరీతో సినిమా క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత తమిళంలో విజయ్ ద్విపాత్రాభినయంలో నటించిన ‘కత్తి’ సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని .. తెలుగులో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు చిరంజీవి (Twitter/Photo)
ముందుగా కత్తి రీమేక్‌ను పవన్ కళ్యాణ్‌తో చేద్దామనుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు వద్దకు ’కత్తి’ రీమేక్ చేరినా.. వాళ్లందరు నో చెప్పడంతో చివరకు ఈ రీమేక్ స్టోరీ చిరుకు బాగా కనెక్ట్ అయి.. కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించి ‘ఖైదీ నంబర్ 150’ టైటిల్‌తో రీ ఎంట్రీలో నిజంగా అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అన్నట్టు బాక్సాఫీస్ దగ్గర ఇరగదీసారు చిరంజీవి. (Twitter/Photo)
‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో రామ్ చరణ్ నిర్మాతగా మారారు. కొణిదెల ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఠాగూర్ తర్వాత చిరంజీవి .. వినాయక్ దర్శకత్వంలో చేసిన రెండో సినిమా. ఈ మూవీలో చిరంజీవి సరసన రామ్ చరణ్‌తో అంతకు ముందే మూడు సినిమాల్లో కథానాయికగా నటించిన కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నారు. అప్పట్లో దీనిపై కొంత వివాదం చెలరేగినా.. ఈ సినిమా కాజల్‌తో చిరు.. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయిందనే టాక్ వినిపించింది. (Twitter/Photo)
‘ఖైదీ నంబర్ 150’సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలు అందించారు. ఈ సినిమాకు చిరంజీవి పెద్ద కూతురు సుస్మితా .. కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 87.87 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రీ ఎంట్రీ మూవీకి ఈ రేంజ్ బిజినెస్ ఏంటా అని అప్పట్లో అందరినీ ఆశ్యార్యపోయేలా చేసారు. ఒక సాదాసీదా కథను తనదైన యాక్టింగ్‌తో చిరంజీవి ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చారు. (Twitter/Photo)
ఖైదీ నంబర్ 150 ప్రపంచ వ్యాప్తంగా రూ. 104.86 కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా ఈ మూవీ కొన్న బయ్యర్స్‌కు రూ. 17 కోట్ల థియేట్రికల్ ప్రాఫిట్ వచ్చింది. ఈ సినిమాలో బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు హీరోగా చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా ప్రేక్షకులను అలరించింది. రీ ఎంట్రీ మూవీతో హీరోగా తన స్థానం చెక్కుచెదరలేదని చిరంజీవి మరోమారు ప్రూవ్ చేసుకున్నారు. (Twitter/Photo)
‘ఖైదీ నంబర్ 150’ తర్వాత చిరంజీవి..తొలిసారి చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ తో పలకరించారు. ఈ మూవీ తర్వాత చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తొలిసారి పూర్తి స్థాయిలో తనయుడు రామ్ చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు చిరంజీవి. త్వరలో మరోసారి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ మూవీతో పాటు ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’, బాబీ, వెంకీ కుడుములతో వరుసగా సినిమాలు కమిటై జోరు చూపిస్తున్నారు చిరు. (Twitter/Photo)