Megastar Chiranjeevi- K Raghavendra Rao | టాలీవుడ్లో చిరంజీవి, కే.రాఘవేంద్రరావులది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో 14 సినిమాలు తెరకెక్కాయి. అందులో 12 సినిమాల్లో చిరంజీవి హీరోగా నటించారు. రెండు చిత్రాల్లో మాత్రం చిరు సెకండ్ హీరో పాత్రలో నటించాki. మొత్తంగా వీళ్లిద్దరి కలయకలో వచ్చిన పలు చిత్రాలు తెలుగు ఇండస్ట్రీలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాయి.
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ చిరంజీవి, కే.రాఘవేంద్రరావు (Twitter/Photo)
2/ 19
టాలీవుడ్లో చిరంజీవి, కే.రాఘవేంద్రరావులది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో 14 సినిమాలు తెరకెక్కాయి. (Youtube/Credit)
3/ 19
ఈ పద్నాలుగు చిత్రాల్లో 12 సినిమాల్లో చిరంజీవి హీరోగా నటిస్తే.. 2 సినిమాల్లో మాత్రం సెకండ్ హీరో పాత్రలో నటించారు. (Youtube/Credit)
4/ 19
మొదటిసారి కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘మోసగాడు’చిత్రంలో నటించిన చిరంజీవి. ఈ చిత్రంలో శోభన్ బాబు మెయిన్ హీరో పాత్రలో నటించారు. చిరంజీవి విలన్‌గా నటించారు. అందాల తార శ్రీదేవి ఈ చిత్రంలో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Youtube/Credit)
5/ 19
చిరంజీవి.. కే,రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం ‘తిరుగులేని మనిషి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘తిరుగులేని మనిషి’ సినిమాలో చిరు సెకండ్ హీరోగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Youtube/Credit)
6/ 19
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మొదటిసారి సోలో హీరోగా నటించిన చిత్రం ‘అడవి దొంగ’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Youtube/Credit)
7/ 19
మెగాస్టార్, దర్శకేంద్రుడు కలయికలో వచ్చిన ‘కొండవీటి రాజా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైయింది. (Youtube/Credit)
8/ 19
కే.రాఘవేంద్రరావు, చిరంజీవి కలయికలో వచ్చిన ఐదో చిత్రం ‘చాణక్య శపథం’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. (Youtube/Credit)
9/ 19
కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఆరో సినిమా ‘మంచి దొంగ’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే నమోదు చేసింది. (Youtube/Credit)
10/ 19
చిరు, దర్శకేంద్రుడి కలయికలో వచ్చిన ఏడో చిత్రం ‘యుద్ధభూమి’ . ఈ మూవీ బాక్సాఫీస్ యుద్ధంలో గెలవలేకపోయింది. (Youtube/Credit)
11/ 19
చిరంజీవి, కే.రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన ఎనిమిదో చిత్రం ‘రుద్రనేత్ర’. చిరంజీవి జేమ్స్‌బాండ్ పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Youtube/Credit)
12/ 19
చిరంజీవి, కే.రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన తొమ్మిదో చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ . ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తెలుగు సినిమా క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. (Youtube/Credit)
13/ 19
‘దర్శకేంద్రుడు, మెగాస్టార్ కాంబినేషన్లో వచ్చిన పదో చిత్రం రౌడీ అల్లుడు’. ఈ సినిమాలో చిరు ఆటోజానీగా,కళ్యాణ్గా రెండు పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Facebook/Photo)
14/ 19
కే.రాఘవేంద్రరావు, చిరంజీవి కలయికలో వచ్చిన పదకొండో చిత్రం ‘ఘరానా మొగుడు’ . ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. (Youtube/Credit)
15/ 19
కే.రాఘవేంద్రరావు, చిరంజీవి కలయికలో వచ్చిన పన్నెండో చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. ఈ సినిమాలో మెగాస్టార్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసారు. మెగాస్టార్ చిరంజీవి.కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. (Youtube/Credit)
16/ 19
చిరంజీవి, కే.రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన పదమూడో చిత్రం ‘ఇద్దరు మిత్రులు’ . ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. (Youtube/Credit)
17/ 19
చిరంజీవి,కే.రాఘవేంద్రరావు కలయికలో చివరగా వచ్చిన చిత్రం ‘శ్రీమంజునాథ’. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన 14వ చిత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. (Youtube/Credit)
18/ 19
వీళ్లిద్దరి కలయికలో 14 చిత్రాలు తెరకెక్కితే.. అందులో 12 చిత్రాల్లో చిరు హీరోగా నటించారు. అందులో ’జగదేకవీరుడు అతిలోకసుందరి ’, ‘ఘరానా మొగుడు’ సినిమాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. మొత్తంగా వీళ్ల కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు దాదాపు 70శాతం సక్సెస్ సాధించాయి. (Youtube/Credit)
19/ 19
మొత్తంగా టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే చెప్పాలి. (Twitter/Photo)