తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రాసుకున్న లూసీఫర్ మూవీని ముందుగా చిరంజీవితో తెరకెక్కించాలనుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు ఆయన రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకొని తనదైన కొంత కాల్పినికత జోడించి ఈ సినిమాను మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కించినట్టు చెప్పారు. (Twitter/Photo)
‘గాడ్ ఫాదర్’ మూవీలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ల మధ్య సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని చెబుతున్నారు. ఆ సన్నివేశాలు ఈ సినిమాలో కీలకం కానున్నాయి. కేవలం చిరంజీవి కోసమే సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరుతో సల్మాన్ ఖాన్ స్టెప్పులు ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉంటుందని చెబుతున్నారు. (Twitter/Photo)
ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ తొలిసారి దక్షణాదిలో నటిస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పారు. ఆ చనువుతో ఇపుడు చిరు మూవీతో డైరెక్ట్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. (Twitter/Photo)
ఇక ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును చిరు పరిశీలించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు లైన్లోకి వచ్చింది. ఫైనల్‌గా సల్మాన్ ఖాన్‌తో ఈ రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కోసం ఓ పాటను కొంచెం పాత్ర నిడివి కూడా పెంచారు. అందుకు తగ్గేట్టే ఈ సినిమాలో పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. (Twitter/Photo)