ఛిరంజీవి కూడా ఎన్టీఆర్ తరహాలో తన సొంతంగా ప్రజా రాజ్యం పార్టీని 2008లో ఆగష్టులో సార్వత్రిక ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు స్థాపించారు. అంతేకాదు ఎన్టీఆర్ 9 నెలల రికార్డును బద్దలు కొట్టాడానికే చిరు అప్పట్లో జనరల్ ఎలక్షన్స్‌కు 8 నెలల ముందు తన పార్టీని స్థాపించారని ఆయన ప్రత్యర్ధులు ఆరోపణలు గుప్పించారు.
ప్పట్లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించినపుడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటనలతో దూసుకుపోతూ ఉండటంతో అప్పటి ప్రదాన మంత్రి ఇందిరా గాంధీ అప్పటి ప్రభుత్వాన్ని ఆరు నెలలు ముందుగానే డిసాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్లారు. ఇలా చేయడం వల్ల ఎన్టీఆర్‌కు తక్కువ సమయంలో తగినంత మంది క్యాడెంట్స్ దొరకరు. ఆ లోపు ప్రచారం చేసుకోవడం కష్టమనే ఉద్ధేశ్యంతో ఇందిరా గాంధీ ఆ పని చేసారు. కానీ అప్పటి ప్రధాని చేసిన ఈ పని వల్ల ఎన్టీఆర్ ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది. (File/Photo)
అందులో 2 తెలంగాణ నుంచి వచ్చాయి. అటు చిరంజీవి పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేసి తిరుపతిలో గెలిచారు. పాలకొల్లులో ఓడిపోవడం విశేషం. ఆ తర్వాత తన ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడై మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో పర్యాటక శాఖ స్వతంత్ర శాఖ మంత్రిగా యేడాదిన్నకు పైగా బాధ్యతలు నిర్వహించారు. (Twitter/Photo)
ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఏపీ స్టార్ కంపెనర్గా బాధ్యతలు నిర్వహించిన అక్కడ ఒక్క సీటు కూడా గెలవకలేకపోయింది. ముఖ్యంగా ఏపీని విభజించారని అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత రాజకీయాలకు క్రమంగా దూరమై.. సినిమా వైపు అడుగులు వేసారు. ప్రస్తుతం ఈయన పాలిటిక్స్’కు ఆమడ దూరంలో ఉంటున్నారు. (Twitter/Photo)
తాజాగా ఈయన హైదరాబాద్‌లోని వైఎన్ఎం కళాశాలతో పూర్వ విద్యార్ధుల సమావేశానికి ఛీఫ్ గెస్ట్‌గా హాజరై రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉంటే మాటలు పడాలి. అనలి. చాలా మొరటుగా కటువుగా ఉండాలి. ఒక సందర్భంలో తనకు ఈ రాజకీయాలు అవసరమా అని అనపించిందన్నారు. ఒక రాజకీయాలకు పవన్ తగిన వాడన్నారు. ఆయన మాటలు అంటాడు. మాటలు పడతాడు. ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్‌ను ఉన్నత స్థానంలో అంటే సీఎంగా చూడాలనుకుంటున్నాను అంటూ తన మనసులో మాట బయట పెట్టారు. (Twitter/Photo)
ఇలాంటి కార్యక్రమానికి రావడం ఇదే మొదటిసారి. వాల్తేరు వీరయ్య షూటింగ్లో బిజీగా ఉన్నాను. రావడానికి కుదురుతుందో లేదో అనుకున్నాను. కానీ గతంలో జరిగిన ఇలాంటి ఆత్మీయ సమావేశానికి సంబంధించిన ఓ విషయం తెలుసుకొని వీలు చేసుకొని మరి ఈ ప్రోగ్రామ్‌కు వచ్చినట్టు చెప్పారు. ఇక పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది 200 ఏళ్ల క్రితమే అమెరికాలో మొదలైందనే విషయాన్ని ప్రస్తావించారు. (Twitter/Photo)
పూర్వ విద్యార్థుల సమ్మేళం కారణంగా తమ గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడం. వారు సాధించిన విజయాలను చర్చించుకోవడం. ఆ దిశగా రావాలనుకునేవారికి ఆదర్శంగా నిలవడం ఈ పూర్వ విద్యార్ధుల సమ్మేళంలో ముఖ్య అంశం. కాలేజీ రోజుల్లో తాము భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నామో దానికి బీజం పడేది అక్కడే అని ఈ సందర్భంగా గుర్తు చేసారు చిరంజీవి.
కాలేజీ రోజుల్లో తాను వేసిన ఓ నాటకంలో తనకు బెస్ట్ యాక్టర్‌గా అవార్డు వచ్చింది. అదే తనను సినిమాలవైపు అడుగులు వేసేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా NCCలో కెప్టెన్ పొజిషన్క వరకు వెళ్లాను. 1976 రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ తరుపున రాజ్‌పథ్‌లో మార్చింగ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. నా మనసుకు నచ్చితే దాని అంతు చూసే వరకు వదలను కానీ రాజకీయాల్లో మాత్రం తాను రాణించలేకపోయిన విషయాన్ని అన్యాపదేశంగా గుర్తు చేసారు. తన లాంటి మృదు స్వభావులకు రాజకీయాలు పడవు. కానీ పవన్‌కు మాత్రం ఓ కమిట్మెంట్తో రాజకీయాలు చేస్తున్నారు. ఏదో ఓ రోజు ఉన్నత స్థానంలో ఉంటాడు అని చిరు వ్యాఖ్యానించడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. (Twitter/Photo)
రీసెంట్గా చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా చూస్తుంటే అందులో చెల్లెలును సీఎంగా చేసే అన్నయ్య పాత్రలో నటించారు. కానీ నిజ జీవితంలో మాత్రం తమ్ముడిని సీఎం కావాలనే తాపత్రయం ఉన్న అన్నయ్యగా పలు సందర్భాల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని ప్రస్తావిస్తూనే ఉన్నారు. తాజాగా చిరు చేసిన వ్యాఖ్యలు వాటికి మరింత బలం చేకూర్చాయి. (Twitter/Photo)