Megastar Chiranjeevi | సైరా నరసింహారెడ్డి తర్వాత మూడేళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత ‘ఆచార్య’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా మెగాభిమానుల అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. రీసెంట్గా ఈయన గాడ్ ఫాదర్ మూవీతో పలకరించారు. కానీ ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. తాజాగా చిరంజీవి.. తనకు రెండు హిట్స్ ఇచ్చిన దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినబడుతోంది. (Chiranjeevi Photo : Twitter) (Photo twitter)
Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్‌జోష్‌లో ఉన్నారు. సైరా నరసింహారెడ్డి తర్వాత మూడేళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత ‘ఆచార్య’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా మెగాభిమానుల అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.ఆ తర్వాత గాడ్ ఫాదర్ మూవీకి మంచి టాక్ వచ్చినా.. అందుకు తగ్గట్టు వసూళ్లు రాబట్టలేకపోయింది. (File/Photo)
తాజాగా చిరంజీవి.. వినాయక్‌తో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రీసెంట్గా రామ్ చరణ్ మమ్ముట్టి నటించిన ‘భీష్మ పర్వం’ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని వినాయక్ చేతిలో పెట్టడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో వినాయక్ చిరుతో తెరకెక్కించిన రెండు చిత్రాలు రీమేక్స్ కావడం వాటిని వినాయక్ అద్భుతంగా తెరకెక్కించి చిరుకు మంచి హిట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
ఇక ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ మార్తాండ’ సినిమాకు చిరంజీవి డబ్బింగ్ వాయిస్ ఓవర్ చెప్పారు. ఈ కోవలో చిరంజీవికి ఓ కథను వినిపించినట్టు సమాచారం. గతంలో కృష్ణవంశీ .. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లకముందు ‘వందేమాతరం’ అనే స్క్రిప్ట్‌ను రెడీ చేసారు. అప్పట్లో ఈ కథను చిరుకు వినిపిస్తే.. ఆయన చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ పాలిటిక్స్‌లో బిజీ కావడంతో అప్పట్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. (Twitter/Photo)
ఇక చిరుతో చేయాల్సిన ఈ కథను కృష్ణవంశీ వేరే హీరోలతో చేయడం ఇష్టం లేక ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసారు. తాజాగా ‘రంగమార్తాండ’ డబ్బింగ్ సమయంలో కృష్ణవంశీ మరోసారి ఈ స్టోరీని చిరుకు వినిపించారట. ఇక చిరు కూడా ఈ కథతో సినిమా చేయడానికి ఓకే చెప్పడంతో పాటు కథలో కొన్ని మార్పులు చేర్పులు సూచించారట. దీనికి కృష్ణవంశీ ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కథలో కొన్ని మార్పులు చేర్పులతో ఇప్పటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. Chiranjeevi and Krishna Vamsi Photo : Twitter
చిరంజీవి అటు దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే సంపత్ నంది తన రిజిస్టర్ చేసుకున్న ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌ను చిరు కోసం త్యాగం చేసిన సంగతి తెలిసిందే. ఇక గోపీచంద్‌తో సంపత్ నంది తెరకెక్కించిన ‘సీటీమార్’ మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం సంపత్ నంది.. సాయి తేజ్‌తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత రజాకార్ల నేపథ్యంలో సినిమా చేసే అవకాశాలున్నాయి. (Instagram/Photo
అటు ’శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సూపర్ హిట్ రీమేక్ చేయాలనే ఆలోచనలో చిరు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభుదేవా దర్శకత్వం చేయబోనని మీడియాకు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లిద్దరి కలయికలో సినిమా తెరకెక్కుతుందా లేదా అనేది చూడాలి. తాజాగా ప్రభుదేవా చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో చిరు, సల్మాన్ లపై ఓ పాటను పిక్చరైజ్ చేసారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. (File/Photo) (Twitter/Photo)
మరోవైపు దర్శకుడు వంశీ పైడిపల్లి.. చిరంజీవిని కలిసి ఓ కథను వినిపించడట. ఈ స్టోరీ విని చిరు కూడా ఇంప్రెస్ అయినట్టు సమాచారం. వంశీ పైడిపల్లి 2019 యేడాది గాను మహర్షి సినిమాకు నేపనల్ అవార్డును అందుకున్నారు. ఇక చిరుతో చేయబోయే సినిమా కూడా మంచి సామాజిక సందేశం ఉన్న కథతోనే తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. (Twitter/Photo)
త్రివిక్రమ్: చాలా రోజుల కిందే ఈ కాంబినేషన్ అనౌన్స్ అయింది. ‘వినయ విధేయ రామ’ ఆడియో వేడుకలోనే త్రివిక్రమ్ సినిమా ప్రకటించాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం మహేష్ బాబు, వెంకటేష్,ఎన్టీఆర్ సినిమాల తర్వాత చిరంజీవి, త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అప్పట్లో ప్రముఖ నిర్మాత సుబ్బిరామిరెడ్డి.. చిరు, పవన్‌లతో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమాను అనౌన్స్ చేసారు. కానీ ఆ తర్వాత ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. (Twitter/Photo)
ప్రశాంత్ వర్మ: అ.. సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకుని ఆ తర్వాత కల్కితో పర్లేదు అనిపించుకున్న కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ‘జాంబీ రెడ్డి’తో మరో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘దటీజ్ మహాలక్ష్మి’ షూటింగ్ కంప్లీటైన విడుదల కాలేదు. అటు హనుమాన్ అనే సూపర్ హీరో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ.. బాలయ్య టాక్ షోను డైరెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ తర్వాత మిగతా ప్రాజెక్ట్‌లను టేకప్ చేయనున్నారు. ఆ సంగతి పక్కనపెడితే.. ప్రశాంత్ వర్మ కూడా చిరంజీవితో సినిమా చేయాలని చూస్తున్నాడు. మెగాస్టార్‌కు కథ చెప్పాలని ట్రై చేస్తున్నాడు ఈయన. ఇప్పటికే ఓ చిరుకు ఓ కథను వినిపించాడట. చిరు మాత్రం ఈ స్టోరీ లైన్‌ను డెవలప్ చేయమని చెప్పినట్టు సమాచారం. మొత్తంగా చిరుతో ఎంతో మంది దర్శకులు చేయడానికి రెడీగా ఉన్న ఈయన మాత్రం ఎంత మందికి ఛాన్స్ ఇస్తాడనేది చూడాలి.