Chiranjeevi: మెగాభిమానులకు నిరాశ.. వాయిదా పడ్డ మెగాస్టార్ చిరంజీవి మూవీ రిలీజ్.. చిరు కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ మూవీస్ ఉన్నాయి. అందులో కొన్ని చిత్రాలు అభిమానులకు తీపి జ్ఞాపకం అని చెప్పాలి. అలాంటి చిత్రాల్లో ‘గ్యాంగ్ లీడర్’ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాను ఈ నెల 11న రీ రిలీజ్ చేయాలనుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా అంటే మెగా అభిమానులకు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ సినిమా టీవీల్లో వస్తే చూసే ప్రేక్షకులు ఉన్నారు. తాజాగా ఈ సినిమాను వాలెంటైన్స్ డే కానుకగా రీ రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. తాజాగా వాయిదా పడటంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. (Twitter/Photo)
ఒకప్పుడు తెలుగులో పాత సినిమాలు రీ రిలీజ్లు అనేవి ఎక్కువగా ఉండేవి. శాటిలైట్, డిజిటల్ ఎంట్రీతో వీటి దూకుడు తగ్గింది. తాజాగా గత కొన్ని రోజులుగా తెలుగులో పాత సినిమాల రీ రిలీజ్ అనే ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఈ మధ్య పాత సినిమాలను రీ మాస్టర్ చేసి 4Kలో మరోసారి విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ కోవలో ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, బిల్లా, చెన్నకేశవ రెడ్డి,ఖుషీ సినిమాలు విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా ఈ సినిమా 4K పనులు పూర్తి కాకపోవడంతో ‘గ్యాంగ్ లీడర్’ మూవీ రీ రిలీజ్‌ను వాయిదా వేశారు. (Twitter/Photo)
విజయ బాపినీడు తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకుంది గ్యాంగ్ లీడర్. మొత్తానికి ఏదేమైనా కూడా నాగబాబు కోసం సిద్ధం చేసిన కథలో చిరు నటించడం.. అది బ్లాక్ బస్టర్ కావడం.. ఆయన కెరీర్లోనే బెస్ట్ మాస్ సినిమాల్లో ఒకటిగా నిలవడం అంతా యాదృశ్చికమే కదా..!
ఈ సినిమాకు బప్పీలహరి మ్యూజిక్ అందించారు. విజయ బాపినీడు దర్శకత్వం వహించారు. శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించారు. 1991లో మే 9న విడుదలైన ఈ సినిమా అప్పటివరకు ఉన్న అన్ని సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ముందు చిరంజీవికి వరుసగా ప్రతి యేటా ఓ ఘనవిజయం లభించింది. దాంతో ‘గ్యాంగ్ లీడర్’ ఆరంభం నుంచీ సినిమాకు విడుదలకు ముందే క్రేజ్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రతి డైలాగ్ అదిరిపోయింది. ముఖ్యంగా ‘చేయి చూడు ఎంత రఫ్‌గా ఉందో రఫ్పాడించేస్తా’ అనే డైలాగ్ ప్రేక్షకుల నోళ్లలో నానింది. (File/Photo)
అంతకు ముందు చిరంజీవికి ‘పసివాడి ప్రాణం’ (1987), ‘యముడికి మొగుడు’ (1988), ‘అత్తకు యముడు – అమ్మాయికి మొగుడు’ (1989), ‘జగదేకవీరుడు – అతిలోకసుందరి’ (1990) వంటి సినిమాలతో విజయాలను అందుకున్నారు. ఇక 1990లో ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ చిత్రం మే 9న విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా విడుదలైన సరిగా సంవత్సరానికి 1991 మే 9న ‘గ్యాంగ్ లీడర్’ విడుదలై రికార్డ్స్ బ్రేక్ చేసింది. గ్యాంగ్ లీడర్ 30కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది.
ఇక ఈ సినిమా పాటల విషయానికి వస్తే.. కొన్ని సంవత్సరాల పాటు ‘గ్యాంగ్ లీడర్’ పాటలు వినపడని ఊరు లేదు. ఈ చిత్రానికి బప్పీలహరి సంగీతం అందించారు. తెలుగులో ‘సింహాసనం’ లాంటి చిత్రాలతో పాపులరైన బప్పీలహరి.. ‘స్టేట్ రౌడీ’ తర్వాత చిరంజీవితో చేసిన రెండో సినిమా ఇది. ఆ తర్వాత చిరుతో ‘బిగ్‌బాస్’ సినిమాకు పనిచేసారు. .(File/Photo)
ఆ తర్వాత మరోసారి చిరంజీవితో ‘హీరో’ టైటిల్‌తో ఒక సినిమాను తెరకెక్కించాడు విజయ బాపినీడు. ఈ సినిమా అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ‘మహానగరంలో మాయగాడు’, ‘మగధీరుడు’ వంటి సినిమాలను చిరంజీవితో తెరకెక్కించి దర్శకుడిగా తన అభిరుచిని చాటుకున్నాడు. అటు ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్, చివరగా బిగ్‌బాస్ చిత్రం వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
ఇక ‘గ్యాంగ్ లీడర్’ మూవీని హిందీలో చిరంజీవి హీరోగా రవిరాజ పినిశెట్టి ‘ఆజ్ కా గూండారాజ్’ గా రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్టైయింది. చిరు.. తన సినిమాను తానే రీమేక్ చేసింది ఈ మూవీనే. ఇక హిందీలో ఈ సినిమా కంటే ముందు ‘ప్రతిబంధ్’, ఆ తర్వాత ‘ది జెంటిల్మెన్’ సినిమాల్లో నటించారు. చివరి సినిమా ‘ది జెంటిల్మెన్’ ఫ్లాప్‌తో బాలీవుడ్ ఆశలను వొదలుకున్నారు మెగాస్టార్. (Twitter/Photo)