తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో చిరంజీవి, దర్శకుడు రవిరాజ పినిశెట్టి కాంబినేషన్లో పలు హిట్ చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో స్ట్రెయిట్ చిత్రాలతో పాటు పలు భాషల్లో హిట్టైయిన సినిమాలను చిరంజీవితో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. అంతేకాదు చిరంజీవి (Chiranjeevi) రవిరాజా డైరెక్షన్లో ఎక్కువగా చేసిన సినిమాలు రీమేక్స్ కావడం విశేషం. అంతేకాదు ఈయన దర్శకత్వంలోనే ఈయన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ రకంగా రవిరాజా పినిశెట్టి అంటే ప్రత్యేక అభిమానం ఉంది. (Twitter/Photo)
చక్రవర్తి | మెగాస్టార్ చిరంజీవి, రవిరాజ పినిశెట్టి కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ‘చక్రవర్తి’. తమిళంలో శివాజీ గణేషన్ హీరోగా తెరకెక్కిన ‘జ్ఞాన ఓలి’ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ చిత్రంలో మరో కథానాయకుడిగా మోహన్ బాబు నటించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ చిరు చెల్లెలు పాత్రలో నటించారు. భానుప్రియ కథానాయికగా నటించారు. (Twitter/Photo)
ప్రతిబంధ్ | మెగాస్టార్ చిరంజీవి, రవిరాజ పినిశెట్టి కాంబినేషన్లో వచ్చిన నాల్గో చిత్రం ‘ప్రతిబంధ్’. ఈ చిత్రం తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘అంకుశం’ సినిమాకు హిందీ రీమేక్. దర్శకుడిగా రవిరాజ పినిశెట్టికి హీరోగా చిరంజీవికి ఇదే హిందీలో ఫస్ట్ మూవీ. తొలి హిందీ చిత్రంతోనే బాలీవుడ్లో సక్సెస్ అందుకున్నారు చిరంజీవి. ఈ సినిమాతో రవిరాజా పినిశెట్టి .. హీరోగా చిరంజీవిని బాలీవుడ్‌కు పరిచయం చేశారు. (Youtube/Credit)
ఆజ్ కా గూండారాజ్ | మెగాస్టార్ చిరంజీవి, రవిరాజ పినిశెట్టి కాంబినేషన్లో వచ్చిన ఆరో చిత్రం ‘ఆజ్ కా గూండారాజ్’. ఈ చిత్రం తెలుగులో విజయ బాపినీడు దర్శకత్వంలో చిరు హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం హిందీలో కూడా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన మీనాక్షి శేషాద్రి నటించారు. (Twitter/Photo)
SP పరశురాం | మెగాస్టార్ చిరంజీవి, రవిరాజ పినిశెట్టి కాంబినేషన్లో వచ్చిన ఏడో చిత్రం ‘SP పరశురాం’ . ఈ చిత్రం తమిళంలో సత్యరాజ్ హీరోగా తెరకెక్కిన ‘వాల్డర్ వెట్రివెల్’ చిత్రానికి రీమేక్. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తర్వాత చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Youtube/Credit)
చిరంజీవి,రవిరాజా పినిశెట్టి కాంబినేషన్లో ఏడు చిత్రాల్లో నాలుగు హిట్లు, మూడు ఫ్లాప్స్ ఉన్నాయి. మొత్తంగా వీళ్ల కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో 50 శాతం చిత్రాలు సక్సెస్ సాధించాయి. అందులో ‘చక్రవర్తి’, ‘రాజా విక్రమార్క’,‘ప్రతిబంధ్’, ‘ఆజ్ కా గుండారాజ్’ , ‘SP పరశురాం’ వంటి ఐదు సినిమాలు రీమేక్స్ కావడం విశేషం.అంతేకాదు చిరు ఎక్కువగా రీమేక్స్‌తో పాటు ఈయన దర్శకత్వంలోనే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. ఓ రకంగా రవిరాజా పినిశెట్టితో చిరంజీవి కాంబినేషన్‌కు ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పాలి. (Twitter/Photo)