మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ‘చూడాలని వుంది’ విడుదలైన 22 ఏళ్లు..
మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ‘చూడాలని వుంది’ విడుదలైన 22 ఏళ్లు..
Megastar Chiranjeevi |మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ‘చూడాలని వుంది’ విడుదలైన 22 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.
మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ‘చూడాలని వుంది’ విడుదలైన 22 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. (Twitter/Photo)
2/ 10
గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్లో సి.అశ్వినీధత్ నిర్మించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి’ తర్వాత వైజయంతీ మూవీస్ బ్యానర్లో చిరంజీవి నటించిన చిత్రం ‘చూడాలని వుంది’. (Twitter/Photo)
3/ 10
గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూర్తిగా కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించాడు. తన కన్నకొడుకు తన నుంచి దూరం చేసిన మామపై ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో ‘చూడాలని వుంది’ సినిమాన తెరకెక్కించారు. (Twitter/Photo)
4/ 10
ముఖ్యంగా ‘యమహా నగరి’ అంటూ సాగే ఈ పాటను కలకత్తా నేపథ్యంలో వేటూరి గారు రాసిన ఈ పాటను హరిహరణ్ గాత్రానికి మణిశర్మ.. త్యాగరాజ కృతిలో చేసిన ఈ పాట కోల్‌కతా నగర గొప్పదనాన్ని ఆవిష్కరించింది. (Twitter/Photo)
5/ 10
‘చూడాలని వుంది’ చిత్రంలో చిరంజీవి సరసన సౌందర్య, అంజలా ఝవేరి నటించారు. (Twitter/Photo)
6/ 10
చిరంజీవి హీరోగా నటించిన ‘చూడాలని వుంది’ చిత్రం 63 కేంద్రాల్లో 100 రోజులు నడిచింది. (Twitter/Photo)
7/ 10
ఈ చిత్రంలో విలన్‌గా ప్రకాష్ రాజ్ ‘వీడు సామాన్యుడు కాడు’ అంటూ చెప్పే డైలాగు ఎంతో పాపులర్ అయింది. (Twitter/Photo)
8/ 10
చూడాలని వుంది చిత్రం ఆంధ్రప్రదేశ్ ఉత్తమ సంగీతం విభాగంలో మణిశర్మ నంది అవార్డు అందుకున్నారు. (Twitter/Photo)
9/ 10
ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ కామెడీ హైలెట్‌గా నిలిచింది. (Twitter/Photo)
10/ 10
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘చూడాలని వుంది’ చిత్రం హిందీలో అనిల్ కపూర్, రాణి ముఖర్జీ,శిల్పాశెట్టి ప్రధాన పాత్రల్లో ‘కల్కత్తా మెయిల్’ పేరుతో రీమేక్ చేసారు. కానీ బాలీవుడ్లో ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)