మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమా అప్పట్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన రికార్డులకు హద్దే లేదు. బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోయాడు మెగాస్టార్. తన కెరీర్లో తొలిసారి నటించిన ఫ్యాక్షన్ సినిమా ఇది. 20 యేళ్లు దగ్గర పడుతున్న ఈ సినిమాలో ఓ బ్లండర్ మిస్టేక్ ఉంది.. అదేమింటంటే.. (File/Photo)
చిన్ని కృష్ణ, పరుచూరి బ్రదర్స్ కలిసి ఇంద్ర కథను సిద్ధం చేసారు. సీనియర్ దర్శకుడు, ఫ్యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బి గోపాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. అయితే ఇంద్ర సినిమాలో చాలా విశేషాలున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథను చిరు దగ్గరుండి రెడీ చేయించుకున్నాడు. అందులో చాలా ఎపిసోడ్స్ కూడా చిరు బుర్రలోంచి వచ్చినవే.
దానికి తోడు చిరంజీవిలో ఎంత మంచి దర్శకుడు ఉన్నాడనేది కూడా ఇంద్ర చూపించింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఇంద్ర సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు చిరంజీవి స్వయంగా డైరెక్ట్ చేసాడు. ఈ విషయం కూడా ఎవరో చెప్పలేదు.. ఆ చిత్ర దర్శకుడు బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ అల్లరి రాముడు సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఇంద్ర, అల్లరి రాముడు దాదాపు ఒకే సమయంలో షూటింగ్ చేసుకుంటున్న తరుణంలో.. ఇంద్ర సెకండాఫ్ చాలా వరకు చిరంజీవి స్వయంగానే డైరెక్ట్ చేసుకున్నాడని.. అంతేకాదు మెగాస్టార్లో ఎంతమంచి దర్శకుడు ఉన్నాడో అప్పుడే తనకు తెలిసిందని చెప్పాడు బి గోపాల్. ఎడిటింగ్ రూమ్‌లోనూ చిరు విలువైన సలహాలు ఇంద్ర సినిమాకు చాలా ఉపయోగపడ్డాయి.
ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అదనపు ఆకర్షణ. ఇందులో ఒక పాటకు అప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ స్వరాలందించాడు. ఇంద్రకు అంతకు ఏడాది ముందు 2001లో ఇండస్ట్రీ రికార్డులను సెట్ చేసాడు నరసింహనాయుడు. మధ్యలో చాలా సినిమాలు వచ్చినా కూడా రికార్డులు తిరగరాయలేదు.
అలాంటి సమయంలో వచ్చిన ఇంద్ర చరిత్ర లిఖించింది. ఈ సినిమాకు ముందు డాడీ, శ్రీ మంజునాథ, మృగరాజు లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ సమయంలో వచ్చిన ఇంద్ర రికార్డులు తిరగరాసింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమాలో ఒకటి కాదు ఒక బ్లండర్ మిస్టేక్ ఉన్నాయి. అవేమిటంటే.. ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లో ఓ సీన్లో హోళి ఆడుతుంటారు. అంతలోనే చిరంజీవికి వాళ్ల అక్కలు రాఖీ కడతారు. ఇదే ఈ సినిమాలో పెద్ద మిస్టేక్. రెండు పండగలను ఒకే సమయంలో చూపించడమనేది ఈ సినిమాలో చేసిన తప్పు. ఈ విషయాన్ని చిత్ర బృందం పలుమార్లు క్షమాపణాలు చెప్పారు కూడా.
ఈ సినిమా కోసం నైజాం హక్కులను చిరు రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడని ప్రచారం ఉంది. అంటే అప్పట్లోనే ఇంద్ర సినిమా కోసం రూ. 7 కోట్లకు పైగా అందుకున్నాడు మెగాస్టార్. రూ. 16 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం రూ. 29 కోట్ల షేర్ వసూలు చేసి బయ్యర్లకు కాసుల పంట పండించింది. రిపీట్ రన్ అవన్నీ కలిపితే.. రూ. 32 కోట్లకు పైగా షేర్ సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.