టాలీవుడ్లో చిరంజీవి, కే.రాఘవేంద్రరావులది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో 14 సినిమాలు తెరకెక్కాయి. అందులో 12 సినిమాల్లో చిరంజీవి హీరోగా నటించారు. రెండు చిత్రాల్లో మాత్రం చిరు సెకండ్ హీరో పాత్రలో నటించారు. మొత్తంగా వీళ్లిద్దరి కలయకలో వచ్చిన పలు చిత్రాలు తెలుగు ఇండస్ట్రీలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసాయి.
మోసగాడు | మొదటిసారి కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘మోసగాడు’చిత్రంలో నటించిన చిరంజీవి. ఈ చిత్రంలో శోభన్ బాబు మెయిన్ హీరో పాత్రలో నటించారు. చిరంజీవి విలన్‌గా నటించారు. అందాల తార శ్రీదేవి ఈ చిత్రంలో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Youtube/Credit)
కే.రాఘవేంద్రరావు, చిరంజీవి కలయికలో వచ్చిన పన్నెండో చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. ఈ సినిమాలో మెగాస్టార్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసారు. మెగాస్టార్ చిరంజీవి.కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రోజా, నగ్మా, రమ్యకృష్ణ హీరోయిన్స్‌గా నటించారు. (Youtube/Credit)
చిరంజీవి,కే.రాఘవేంద్రరావు కలయికలో చివరగా వచ్చిన చిత్రం ‘శ్రీమంజునాథ’. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన 14వ చిత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మీనా పార్వతి దేవిగా, యమునా గంగా దేవి పాత్రలో నటించారు. మిగిలిన పాత్రల్లో అర్జున్, సౌందర్య, అంబరీష్, సుమలత నటించారు. (Youtube/Credit)