మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈయన జోరు చూసి అంతా షాక్ అవుతున్నారు. అదేం జోరు సామీ అంటూ పండగ చేసుకుంటున్నారు. ఈ మధ్యే మరో సినిమాను అనౌన్స్ చేసాడు చిరంజీవి. ఒకేసారి అరడజన్ సినిమాలు చేస్తున్నాడు మెగాస్టార్. కుర్ర దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించాడు చిరంజీవి. చాలా రోజుల కిందే చిరును కలిసి కథ చెప్పాడు వెంకీ. అప్పుడే ఈ ఇద్దరి కాంబినేషన్ గురించి గాసిప్స్ వచ్చాయి.
దాన్ని నిజం చేస్తూ కొన్ని రోజుల కింద అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా కథ సిద్ధం చేసే పనిలోనే బిజీగా ఉన్నాడు వెంకీ. తనకు యిష్టమైన హీరోను.. అభిమానులు కోరుకునే విధంగా చూపించడానికి కసరత్తులు చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మాతగా ఈ సినిమా రాబోతుంది. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఈయన బిజీగా ఉన్నాడిప్పుడు. దీని తర్వాత కూడా వరసగా సినిమాలు నిర్మిస్తూనే ఉన్నాడు దానయ్య.
పైగా భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ నిర్మాత. ఛలో సినిమాతో దర్శకుడిగా మారిన వెంకీ కుడుముల.. భీష్మ సినిమాతో మరో విజయం అందుకున్నాడు. త్రివిక్రమ్ శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన. అంతేకాదు ఈ రెండు సినిమాల్లో అదిరిపోయే కథతో పాటు కామెడీ కూడా అద్భుతంగా వర్కవుట్ అయింది. ముఖ్యంగా ఛలో సినిమాలో కామెడీకి చిరంజీవి పడిపోయాడు.
ఆ సినిమా తనకు చాలా బాగా నచ్చిందని ఇదివరకే ఓసారి చెప్పాడు మెగాస్టార్. అప్పుడే తనకు వెంకీతో పని చేయాలని ఉందని చెప్పాడు చిరంజీవి. అన్నట్లుగానే ఆయనకు ఛాన్స్ ఇచ్చాడు. వెంకీ కుడుముల కూడా చిరు ఆఫర్‌తో ఎగిరి గంతేస్తున్నాడు. తను చిరంజీవికి చిన్నప్పటి నుంచి వీరాభిమాని అని.. ఆ అవకాశం వచ్చిందని చెప్తున్నాడు ఈయన. డివివి దానయ్య నిర్మాతగా డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ట్విట్టర్లో అనౌన్స్ చేసాడు చిరంజీవి. నిజానికి డివివి దానయ్య నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కాకపోయినా అతడి శిష్యుడితో సినిమా వర్కవుట్ చేసాడు నిర్మాత దానయ్య. ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా డాక్టర్ మాధవి రాజు వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా చిరంజీవి క్లాసిక్ హిట్ ముఠా మేస్త్రి సీక్వెల్ అనే ప్రచారం జరుగుతుంది. వెంకీ కుడుముల ఇందులో చిరంజీవి పాత్రను ముఠా మేస్త్రి నుంచి స్పూర్తి పొంది రాసుకుంటున్నాడని.. మెగాస్టార్ కూడా దానికి ఓకే చెప్పాడని తెలుస్తుంది. కామెడీ అద్భుతంగా పండించే వెంకీ కుడుముల.. చిరుతో అదిరిపోయే ఎంటర్టైనింగ్ రోల్ చేయించబోతున్నాడు. మొత్తానికి చూడాలిక.. ఒకవేళ అన్నీ కుదిరి ముఠా మేస్త్రీ సీక్వెల్ వర్కవుట్ అయిందంటే మాత్రం అంతకంటే ఫ్యాన్స్‌కు కోరుకునేది ఏముండదు..!