ఇప్పుడున్న టెక్నాలజీతో కాపీ కొడితే నిమిషాల్లో దొరికిపోతున్నారు. ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఇట్టే సోషల్ మీడియాలో దాని బండారం బయటపెడుతున్నారు. ఎందుకంటే ఎలాంటి పాట అయినా కూడా బాగుంటే బాగుంది అంటారు.. బాగున్నా కూడా ఇది ఎక్కడ్నుంచి ఎత్తుకొచ్చారు అంటూ ట్రోలింగ్ చేస్తుంటారు. అలా ప్రతీ పాటకు మూలం ఎక్కడో ఓ చోట ఉందని వెతికే బ్యాచ్ ఎప్పుడూ ఒకటి సోషల్ మీడియాలో సిద్ధంగా ఉంటుంది.
ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య పాట విడుదలైంది. కల్లోలం కల్లోలం అంటూ సాగే ఈ పాటకు మెగా స్టెప్పులు అదిరిపోయాయి. ఆచార్య సినిమాలోని ఈ పాట ప్రస్తుతం యూ ట్యూబ్‌ను షేక్ చేస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత మణిశర్మ పెద్ద సినిమాకు పని చేస్తున్నాడు. పైగా ఆయనకు చిరంజీవితో కూడా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక ఈ పాటలో రెజీనా తన అందాలను ఆరబోసింది.
చిరు కూడా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో బాగానే చిందులేసాడు. ఈయన గ్రేస్ చూసి ఆహా నువ్వు సూపర్ బాసూ అంటూ అంతా ఫిదా అయిపోతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ శానా కష్టం సాంగ్ ట్యూన్ వింటున్నపుడే.. ఇది ఎక్కడో విన్నట్లుందే అని అంతా అనుకున్నారు. ఇప్పుడు దాని ఒరిజినల్ కనుక్కున్నారు. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు చాలా ఇండస్ట్రీల్లో ఇప్పుడు కాపీ సాంగ్స్ ఎక్కువైపోతున్నాయి అంటూ విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల విషయంలో కూడా ఇదే జరుగుతున్నాయి. తమన్, దేవీ శ్రీ ప్రసాద్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇలా కాపీ సాంగ్స్ కొట్టి కొన్ని సందర్భాల్లో దొరికిపోయారు. ఆ తర్వాత దానికి వాళ్ళు వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు చిరు పాట కూడా కాపీ అనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా శానా కష్టం సాంగ్ ట్యూన్ 37 ఏళ్ళ కింద వచ్చిన హిందీ సినిమా టార్జాన్‌లో పాటకు కాపీ అని తెలిసిపోతుంది.
1985లో వచ్చిన ఈ సినిమాకు బప్పీలహరి సంగీతం అందించాడు. జిలేలే జిలేలే అంటూ సాగే ఈ ట్యూన్.. ఇప్పుడు కల్లోలం కల్లోలం సాగే ట్యూన్ సేమ్ టూ సేమ్ ఉన్నాయి. తెలిసి చేసాడో.. తెలియకుండా చేసాడో తెలియదు కానీ.. మణిశర్మ మాత్రం ఒకే ట్యూన్ తీసుకున్నాడు. ఆ తర్వాత పాట వేరేలా ఉంది కానీ మెయిన్ పల్లవి మాత్రం అక్కడ్నుంచే కాపీ అయింది.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. రెండు పాటలను పోలుస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. శానా కష్టం పాటను రేవంత్, గీతా మాధురి పాడారు. ఫిబ్రవరి 4న ఆచార్య విడుదల కానుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్. పూజా హెగ్డే ఇందులో చరణ్‌కు జోడీగా నటిస్తుంది.