మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం కోసం మెగాభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మధ్యలో మాయదారి కరోనా వచ్చింది కానీ లేకపోతే ఈ సినిమా గతేడాది విడుదలయ్యేది. ఇప్పుడు ఫిబ్రవరి 4 అంటూ కొత్త తేదీ కన్ఫర్మ్ చేసుకుంది ఆచార్య. అప్పుడైనా వస్తుందా అనే అనుమానాలు అందరికీ వస్తున్నాయిప్పుడు.
ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల గురించి ఈ కథ నడుస్తుంది. ఇప్పటికే కొరటాల శివ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్, పోస్టర్స్‌లోనూ ఇదే విషయం చూపించారు కూడా. ఈ సినిమా కచ్చితంగా చిరు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అంతా నమ్ముతున్నారు.
ఇప్పటికే షూటింగ్ కూడా అయిపోయింది. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే మిగిలి ఉంది. దాంతో పాటు చిన్న ప్యాచ్ వర్కులు మాత్రమే మిగిలిపోయాయి. వాటికి కూడా ప్యాకప్ చెప్పేసి.. పోస్ట్ ప్రొడక్షన్‌తో బిజీ అయిపోవచ్చు. అయితే కరోనా కారణంగా సినిమా ఫిబ్రవరి 4న రావడం దాదాపు అసాధ్యమే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడే మూడో దశ మొదలైంది. రాబోయే రోజుల్లో ఇంకా దారుణంగా ఉండబోతుంది పరిస్థితి.
ఒక్కముక్కలో చెప్పాలంటే 60 శాతం ఆచార్య షూటింగ్ ఇక్కడే ఉంటుంది. రామ్ చరణ్, చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాల చిత్రీకరణ కూడా ఇందులోనే ఉండబోతుంది. అలాగే లాహే లాహే పాట ఇక్కడే చిత్రీకరించారు దర్శకుడు కొరటాల. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో భారీ ఉత్సవంలా ఈ పాటను చిత్రీకరించారు. విజువల్ ట్రీట్‌గా ఈ పాట ఉంటుందని అర్థమవుతుంది.
దాంతో పాటు మరికొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ధర్మస్థలి సెట్లోనే చిత్రీకరించారు. ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే 20 కోట్లకు పైగా ఖర్చు చేసారు. సినిమాలో చిరంజీవి పారితోషికం తర్వాత అంత ఎక్కువ ఖర్చు చేసింది ఈ సెట్ కోసమే. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరు సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పుడే రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు వస్తున్నాయి. రానున్న రోజుల్లో కనీసం రోజుకు 8 లక్షల వరకు హైయ్యస్ట్ చూస్తారని ఆరోగ్య శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వచ్చే సినిమాలన్నీ వాయిదా వేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులో ఆచార్య కూడా ఉందని అంతా చర్చించుకుంటున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న రావడం పక్కా అని నిర్మాతలు చెప్తున్నా.. పరిస్థితులు చూస్తుంటే మాత్రం అది సాధ్యమయ్యేలా కనబడటం లేదు.
2022 ఫిబ్రవరి 4న ఆచార్య విడుదల చేస్తుండటం వెనక ఓ రకంగా సెంటిమెంట్ కూడా ఉంది. అదే నెలలోనే గతంలో కొరటాల డెబ్యూ మూవీ మిర్చి కూడా విడుదలై సంచలన విజయం సాధించింది. మళ్లీ ఆచార్య కూడా అదే నెలలో తీసుకొస్తున్నారు. మొత్తానికి అనుకున్న తేదీకి ఆచార్య వస్తే మాత్రం కచ్చితంగా మెగాస్టార్ ఫ్యాన్స్‌కు అంతకంటే కావాల్సింది మరోటి లేదు.