ప్రశాంత్ వర్మ: అ.. సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకుని ఆ తర్వాత కల్కితో పర్లేదు అనిపించుకున్న కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా చిరంజీవితో సినిమా చేయాలని చూస్తున్నాడు. మెగాస్టార్‌కు కథ చెప్పాలని ట్రై చేస్తున్నాడు ఈయన. అన్నీ అనుకున్నట్లు జరిగితే చిరంజీవికి అదిరిపోయే కథ చెప్తానంటున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ‘జాంబి రెడ్డి’ సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.