Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఒకటికి నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అన్నీ షూటింగ్ హడావుడిలో ఉన్నాయి. ఈ యేడాది ఇప్పటికే ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీస్‌తో పలకరించిన ఈయన వచ్చే యేడాది మూడు నాలుగు సినిమాలతో రెడీగా ఉన్నారు. అందులో బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేస్తున్నారు. (Twitter/Photo)
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5, 2022న థియేటర్లలో గ్రాండ్ రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హిందీ నటుడు సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో పాత్రలో నటించిన పెద్ద ఒరిందేమి లేదు. మలయాళంలో లాగా పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఇక అది అలా ఉంటే చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పెడుతున్నట్టు చిరంజీవి కన్ఫామ్ చేశారు. (twitter/photo)
తాజాగా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ ₹50 కోట్ల మొత్తాన్ని చెల్లించిందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు అని తెలుస్తోంది. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నారట. ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించబోతుందని లేటెస్ట్ టాక్. ఇప్పటికే శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో కీలకపాత్రలో సీనియర్ హీరోయిన్ సుమలత కనిపించనున్నారట. చిరంజీవి డ్యుయల్ రోల్లో కనిపించనున్నారట. అందులో భాగంగానే శృతిహాసన్‌తో పాటు సుమలత నటించనున్నారని అంటున్నారు. Photo : Twitter
ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక యూరప్, మాల్టా దేశంలో షూట్ చేయనున్నారట టీమ్. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. తదుపరి షెడ్యూల్ అక్కడే జరుగనుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. Photo : Twitter
పూనకాలు లోడింగ్ అంటూ బాబీ విడుదల చేసిన ఈ పోస్టర్ నిజంగానే అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. అందులో చిరంజీవి లుక్ అయితే మరీనూ.. మాస్ ఆడియన్స్‌తో డాన్సులు చేయించేలా ఉన్నాడు బాబీ. ఈ సినిమాకు పక్కా మాస్ టైటిల్ కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తుంది. లుంగీ కట్టి.. నోట్లో బీడీ పెట్టి చాలా రోజుల తర్వాత పక్కా కమర్షియల్ కారెక్టర్లో కనిపించబోతున్నాడు మెగాస్టార్ .
చిరంజీవి సినిమా అంటే అభిమానులు ఏదైతే ముందుగా ఊహిస్తారో దాన్నే చూపించబోతున్నాడు బాబీ. చిరు సినిమా అంటే ముందుగా ఫ్యాన్స్ కోరుకునేది పవర్ ఫుల్ కథ. ఇందులో అలాంటి కథనే ఒండుతున్నాడు బాబీ. ఈ సినిమా ఎలా ఉండబోతుందో కేవలం పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అందులో చిరు లుక్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. అయితే దీనికి టైటిల్ మాత్రం ఆసక్తికరంగా పెట్టబోతున్నాడు బాబీ.
బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ విశాఖతో పాటు శ్రీలంక నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఇందులో చిరంజీవి పోలీస్ ఆఫీసర్ అని.. అయితే ముందుగా అది రివీల్ చేయకుండా ఇంటర్వెల్ టైమ్‌కు బయటికి వస్తుందని.. ఆ ట్విస్టుతోనే సినిమా రేంజ్ మారిపోతుందని తెలుస్తుంది. శ్రీలంక సముద్ర తీరం నేపథ్యంలోనే కథ సాగుతుందని ప్రచారం జరుగుతుంది. (Twitter/Photo)
పైగా ఇప్పటికే పవన్, రవితేజ, వెంకటేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేసిన అనుభవం ఉండటంతో బాబీని పూర్తిగా నమ్మేస్తున్నాడు చిరు. ఇందులో అభిమాని, స్టార్ హీరో మధ్య జరిగే ఎమోషనల్ కథను చూపించబోతున్నాడు బాబీ. చిరు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తుంది. పూనకాలు లోడింగ్ అంటూ మరింత ఆసక్తి పెంచేసాడు బాబీ. ఈ పోస్టర్ చూస్తుంటేనే సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇందులో రవితేజ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. మరోవైపు నాగార్జున, వెంకటేష్ కూడా నటిస్తున్నట్టు సమాచారం. (Twitter/Photo)
గతంలో రవితేజ.. చిరంజీవి హీరోగా నటించిన హిందీ మూవీ ‘ఆజ్ కా గూండారాజ్’ సినిమాలో నలుగురు స్నేహితుల్లో ఒకరిగా నటించారు. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి, సౌందర్య హీరో,హీరోయిన్లుగా నటించిన ‘అన్నయ్య’ చిత్రంలో చిరు తమ్ముడు పాత్రలో నటించారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’లో ఓ పాటలో రవితేజ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ పాత్రలో అలరించారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించారు. (File/Photo)