చిరంజీవిని నెంబర్ వన్ హీరోగా చేసిన ఇండస్ట్రీ హిట్ సినిమాకు 34 ఏళ్లు పూర్తి.. (Twitter/Photo)
2/ 10
సరిగ్గా 34 ఏళ్ల (23-7-1987) క్రితం విడుదలైన ‘పసివాడి ప్రాణం’ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. (Twitter/Photo)
3/ 10
‘పసివాడి ప్రాణం’ చిత్రం మలయాళంలో మమ్ముట్టి హీరోగా ఫాజిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పూవిన్ను పుతియా పూతెన్నాయ్’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేసారు. (Twitter/Photo)
4/ 10
‘ఖైదీ’ తర్వాత తెలుగులోొ చిరంజీవికి ‘పసివాడి ప్రాణం’ రెండో ఇండస్ట్రీ హిట్ (Twitter/Photo)
5/ 10
మెగాస్టార్ చిరంజీవి, ఏ.కోదండరామిరెడ్డి కలయికలో వచ్చిన పదిహేడో చిత్రం ‘పసివాడి ప్రాణం’. (Twitter/Photo)
6/ 10
’పసివాడి ప్రాణం’ సినిమాకు చక్రవర్తి అందించిన సంగీతం సూపర్ హిట్. ఈ చిత్రానికి ఆత్రేయ, వేటూరి అద్భుతమైన సాహిత్యం అందించారు. (Twitter/Photo)
7/ 10
ఈ చిత్రంలో చిరంజీవి సరసన విజయశాంతి, సుమలత నటించారు. విజయశాంతితో చిరంజీవికి ఇది తొమ్మిదో సినిమా. (Twitter/Photo)
8/ 10
‘పసివాడి ప్రాణం’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ నిర్మించారు. (Twitter/Photo)
9/ 10
‘పసివాడి ప్రాణం’ చిత్రానికి జంధ్యాల మాటలు రాస్తే.. లోక్ సింగ్ సినిమాటోగ్రఫీ అందించారు. (Twitter/Photo)
10/ 10
1987లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘పసివాడి ప్రాణం’ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సినిమా రూ. 4.75 కోట్ల వసూళ్లను సాధించింది. (Twitter/Photo)