HBD Ram Charan - Chiranjeevi | తండ్రికి పుత్రోత్సాహం ఆ పుత్రుడు జనయించినపుడు కాదు.. జనులా పుత్రున్ని చూసి పొగిడినపుడు అంటారు. ఇప్పుడు చిరంజీవి కూడా ఇదే అనుభవిస్తున్నాడు. తనయుడిని చూసి అంతా మెచ్చుకుంటుంటే తను ఆ పుత్రోత్సాహాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు మెగాస్టార్. తన జీవితంలో అన్నింటికంటే విలువైన వరం రామ్ చరణ్ అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు చిరు. ఇప్పుడు కూడా ఇదే అంటున్నాడు. మార్చ్ 27న చరణ్ పుట్టిన రోజు. దాంతో తనయుడికి ఆత్మీయంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు చిరంజీవి