తెలుగులో కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని హిందీలో రవిరాజా పినిశెట్టి (RaviRaja Pinisetty) డైరెక్ట్ చేశారు. బాలీవుడ్లో హీరోగా చిరంజీవితో పాటు.. దర్శకుడిగా రవిరాజా పినిశెట్టికి ఇదే ఫస్ట్ మూవీ. ఇక నిర్మాతగా అల్లు అరవింద్ (Allu Aravind) కూడా ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అటు దివంగత నటుడు రామిరెడ్డిక ఇదే ఫస్ట్ హిందీ మూవీ. (File/Photo)
హీరోగా బెల్లంకొండను టాలీవుడ్‌కు పరిచయం చేసిన వినాయక్.. ఇపుడు బాలీవుడ్లో బెల్లంకొండ శ్రీనివాస్‌ను పరిచయం చేస్తున్నారు. హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు దర్శకుడిగా వినాయక్‌కు ఇదే తొలి బాలీవుడ్(Bollywood) మూవీ. ఇక చిరంజీవి బాలీవుడ్లో తొలి సక్సెస్ అందుకున్నట్టే బెల్లంకొండ శ్రీనివాస్ .. బాలీవుడ్లో హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. (File/Photo)
కానీ చిరంజీవి మాత్రం అప్పట్లో రాజశేఖర్ ‘అంకుశం’ హిందీ రీమేక్‌తో ఎంట్రీ ఇస్తే.. ఇప్పట్లో బెల్లంకొండ శ్రీనివాస్ .. ప్రభాస్ ‘ఛత్రపతి’ రీమేక్ మూవీతో బాలీవుడ్లో లక్ పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా అపుడు చిరంజీవి అలా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే.. ఇపుడు బెల్లంకొండ హిందీ చిత్ర పరిశ్రమలో ఇలా ఎంట్రీ ఇవ్వనున్నడన్న మాట. (File/Photo)
అటు రామ్ చరణ్.. అమితాబ్ బచ్చన్ ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ ‘జంజీర్’ సినిమాను అదే టైటిల్‌తో రీమేక్ చేయడంతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. మరోవైపు రామ్ చరణ్.. ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ మూవీ.. ఒకప్పటి హిందీ సూపర్ హిట్ సినిమా కాబట్టి.. ఇది తెలుగు నుంచి హిందీలో వెళ్లిన సినిమా కాదనే చెప్పాలి. (File/Photo)