మెగా బ్రదర్ నాగబాబు.. అన్నయ్య చిరంజీవితో నిర్మించిన మూడో చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారి త్రిపాత్రాభినయం చేసారు. ఈ చిత్రం హిందీలో వచ్చిన యాదోంకీ బారాత్, తెలుగులో వచ్చిన అన్నదమ్ముల అనుబంధం, ముగ్గురు కొడుకులు సినిమాలను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. అందులో ముగ్గురు వేరే హీరోలు నటిస్తే.. ఇందులో చిరంజీవి ఒక్కరే మూడు పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. (Youtube/Credit)
మెగా బ్రదర్ నాగబాబు.. అన్నయ్య చిరంజీవితో నిర్మించిన నాల్గో చిత్రం ‘బావగారూ బాగున్నారా’. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ,చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. నాగబాబు నిర్మాణంలో వచ్చిన చిత్రాల్లో ఏకైక హిట్ అనిపించుకున్న చిత్రంగా బావగారూ బాగున్నారా రికార్డులకు ఎక్కింది. (File/Photo)
మొత్తంగా నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో 8 సినిమాలు నిర్మిస్తే.. అందులో ఐదు చిత్రాల్లో అన్నయ్య చిరంజీవి హీరోగా నటించారు. ఇక పవన్ కళ్యాణ్‌తో ‘గుడుంబా శంకర్’ సినిమాను నిర్మించాడు. రామ్ చరణ్‌తో ఆరెంజ్ సినిమాను తెరకెక్కించాడు. అటు తనే హీరోగా కౌరవుడు సినిమాను తెరకెక్కించాడు. ఇందులో ‘బావగారూ బాగున్నారా’ సినిమా తప్పిస్తే.. మిగతా సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బొక్కా బోర్లా పడ్డాయి. (Twitter/Photo)
అటు నాగబాబు.. అన్నయ్య చిరంజీవితో నిర్మాతగానే కాకుండా నటుడిగా పలు చిత్రాల్లో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అన్నయ్య చిరంజీవితో ముందుగా రాక్షసుడు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు నాగబాబు. ఆ తర్వాత అన్నయ్యతో కలిసి ‘త్రినేత్రుడు’, ‘మరణ మృదంగం’, ‘కొండవీటి దొంగ’, మృగరాజు, హ్యాండ్సప్’, బావగారూ బాగున్నారా, అంజి చిత్రాల్లో అన్నయ్య చిరంజీవితో కలిసి నటించారు నాగబాబు. (Twitter/photo)