Karthika Deepam Vantalakka: వంటలక్క(Vantalakka) అనేది పేరు కాదు.. ఒక వ్యసనం. వదులుకోలేని వ్యసనంగా మారిపోయింది కార్తీక దీపం(Karthika Deepam) సీరియల్. సాయంత్రం 7.30 అయిందంటే చాలు ఎవరైనా కూడా స్టార్ మా ఛానెల్ పెట్టుకోవాల్సిందే. అలా కాదని మరో ఛానెల్ పెడితే ఇంట్లో గొడవలు కాదు.. ఏకంగా మర్డర్లు జరిగిపోతాయి.
తెలుగు బుల్లితెరపైనే కాదు.. బహుశా ఇండియన్ టెలివిజన్‌లోనే మునుపెన్నడూ లేని టిఆర్పీలను పరిచయం చేసిన సీరియల్‘కార్తీక దీపం’. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులకు ఈ సీరియల్ అనేది ఓ అడిక్షన్. వంటలక్క అనేది పేరు కాదు.. ఒక వ్యసనం. వదులుకోలేని వ్యసనంగా మారిపోయింది కార్తీక దీపం సీరియల్.
2/ 9
సాయంత్రం 7.30 అయిందంటే చాలు ఎవరైనా కూడా స్టార్ మా ఛానెల్ పెట్టుకోవాల్సిందే. అలా కాదని మరో ఛానెల్ పెడితే ఇంట్లో గొడవలు కాదు.. ఏకంగా మర్డర్లు జరిగిపోతాయి. ఎందుకంటే అక్కడున్నది వంటలక్క. ఆమె ధాటికి ఐపిఎల్ కూడా తట్టుకోలేక చేతులెత్తేస్తుంది.
3/ 9
ఇంటి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ 7 గంటలకే పూర్తి చేసుకుని టీవీ ముందుకు వచ్చేస్తుంటారు. వంటలక్క ఏం చేస్తుందా అని ఆమె కోసం చూస్తుంటారు. హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు అయితే సాయంత్రం వరకు ఓపిక పట్టలేక ఉదయాన్నే చూసేస్తుంటారు.
4/ 9
అంత క్రేజ్ ఉన్న సీరియల్ మరోటి లేదంటే అతిశయోక్తి కూడా కాదేమో..? ఇప్పటికే 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది కార్తీక దీపం సీరియల్. వంటలక్క క్రేజ్ ముందు టిఆర్పీ జుజుబీలా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ సీరియల్‌పై వచ్చినన్ని మీమ్స్ మరే సీరియల్‌పై రావు కూడా.
5/ 9
2017లో మొదలైన కార్తీక దీపం.. అనేక మలుపులు తిరుగుతూ 2021లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మధ్య సీరియల్ అయిపోతుందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అలాంటిదేం లేదని.. మరో ఏడాదిన్నర వరకు కూడా ఈ సీరియల్‌కు ఢోకా లేదని తెలుస్తుంది.
6/ 9
అయితే ఈ సీరియల్ క్లైమాక్స్ మాత్రం ముందుగానే లీక్ అయిపోయింది. ఇప్పటికే మలయాళంలో ఈ సీరియల్ అయిపోయింది. దాంతో అక్కడి క్లైమాక్స్‌నే ఇక్కడ కూడా షూట్ చేస్తారని తెలుస్తుంది. క్లైమాక్స్‌లో తనకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని తెలుసుకుని.. తన భార్య దీపని క్షమించమని కోరడానికి డాక్టర్ బాబు వెళ్తాడు.
7/ 9
కానీ ఆయన వెళ్లే సమయానికే వంటలక్క ప్రాణాలు కోల్పోతుందని తెలుస్తుంది. అది చూసి గుండె పగిలేలా ఏడుస్తాడు డాక్టర్ బాబు. అయితే అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క.
8/ 9
సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.
9/ 9
మరో 400 ఎపిసోడ్స్ వరకు ఇందులో బాకీ ఉన్నాయి. అయితే వంటలక్క ప్రాణాలు కోల్పోతే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో గృహిణిల కన్నీరుతో వరదలు వచ్చేస్తాయేమో..? ఓ సారి దర్శక నిర్మాతలు ఈ విషయంపై కూడా ఆలోచించాల్సిందే.