Ram Charan - Lokesh Kanagaraj | కార్తితో ‘ఖైదీ’ , విజయ్‌తో ‘మాస్టర్’ సినిమాలతో ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్ తాజాగా కమల్ హాసన్‌తో తెరకెక్కించిన ‘విక్రమ్’తో మంచి సక్సెస్ అందుకున్నారు. దీంతో ఇపుడు రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని ఈయన దర్శకత్వంలో చేయడానికీ ఓకే చెప్పాడు ఈ. గత కొన్నేళ్లుగా వీళ్ల కాంబోలో సినిమా వస్తుందంటూ ప్రచారం జరిగింది.దీనిపై లోకేష్ కనగరాజ్ త్వరలో మా కాంబినేషన్లో సినిమా ఉందంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. త్వరలో వీళ్ల కాంబినేషన్ పై తెరకెక్కే సినిమాపై అఫీషియల్ ప్రకటన వెలుబడనుంది. (Twitter/Photo)
రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసారు. ఈ సినిమాతో ఏర్పడిన గ్యాప్‌ను వరుస సినిమాలు చేయడం ద్వారా పూరించాలనే డిసిషన్ తీసుకున్నారు. మరోవైపు రామ్ చరణ్ .. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు. తొలిసారి పూర్తి స్థాయిలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా మెగాభిమానులను నిరాశ పరిచింది. (Twitter/Photo)
ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత ప్రస్తుతం రామ్ చరణ్ .. తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను శంకర్ సరికొత్త కాన్సెప్ట్‌తో తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో రామ్ చరణ్.. ఎన్నికల అధికారి పాత్రలో కనిపించబోతున్నారు. అందుకే ఈ సినిమాకు ‘సర్కారోడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. Twitter/Photo)
అటు శంకర్ సినిమా చేస్తూనే.. రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని ‘జెర్సీ’తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నారు. ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. త్వరలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను స్పోర్ట్స్ అండ్ యాక్షన్ నేపథ్యంలో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇక గౌతమ్ తిన్ననూరి సినిమాను శంకర్ సినిమాతో పాటే చేయాలనే ఆలోచనలో ఉన్నారు రామ్ చరణ్. ఈ సినిమాలోరామ్ చరణ్‌కు జోడిగా రష్మిక మందన్న పేరు పరిశీలిస్తున్నారు. (Twitter/Photo)
తాజాగా రామ్ చరణ్.. ప్రముఖ దర్శక, నటుడు సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ముందుగా ఈయన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌తో ‘వినోదయ సిత్రం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో మరో సినిమా చేయనున్నారు. ఈయన తెలుగులో గతంలో రవితేజతో ‘శంభో శివ శంభో’, నానితో‘జెండాపై కపిరాజు’ సినిమాలను తెరకెక్కించారు. ఇపుడు చాలా యేళ్లు తర్వాత వరుసగా మెగా హీరోలతో సినిమాలను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. (Twitter/Photo)
మరోవైపు రామ్ చరణ్ వంశీ పైడిపల్లి చెప్పిన కథను ఓకే చేసాడు. ఈ ప్రాజెక్ట్ ఎపుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి. ప్రస్తుతం వంశీ పైడిపల్లి.. విజయ్‌తో ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత చిరంజీవితో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్, వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ‘ఎవడు’ తర్వాత వీళ్లిద్దరు మరోసారి ఈ సినిమా కోసం చేతులు కలుపుతున్నారు. (Twitter/Photo)
అనిల్ రావిపూడి కూడా రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గట్టు ఒక హిల్లేరియస్ స్టోరీ తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఈ స్టోరీపై కూడా రామ్ చరణ్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నాట్టు సమాచారం. ఎఫ్ 3, బాలయ్య, కళ్యాణ్ రామ్ తర్వాత అనిల్ రావిపూడి రామ్ చరణ్‌తో మూవీ చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి మరో రెండేళ్లు పట్టేలా ఉంది. (Twitter/Photo)
ఇక బాబాయి పవన్ కళ్యాణ్ నిర్మాణంలో త్రివిక్రమ్‌తో ఒక సినిమా అనుకుంటున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇక మహేష్ బాబుతో చేయబోయే సినిమాను సమ్మర్లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అక్కడ నుంచి కంటిన్యూగా షూట్ చేసి వచ్చే సంక్రాంతికి ఈ మూవీ విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో రామ్ చరణ్ కాంబినేషన్ ఉండే అవకాశం ఉంది. (Twitter/Photo)
విక్రమ్ కుమార్ తెలుగు తెరపై ఇప్పటి వరకు రానీ డిఫరెంట్ స్టోరీతో రామ్ చరణ్‌ను ఇంప్రెస్ చేసాడట. కానీ రామ్ చరణ్ మాత్రం విక్రమ్ కుమార్‌కు ఇంకా ఓకే చెప్పలేదు.ప్రస్తుతం ఈయన నాగ చైతన్యతో ‘థాంక్యూ’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. దాంతో పాటు చైతూతో ఓ వెబ్ సిరీస్ కూడా తెరకెక్కిస్తున్నారు. (Twitter/Photo)
రామ్ చరణ్ తన తర్వాత ప్రాజెక్ట్‌ను సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా తన కథతో చరణ్‌ను మెప్పించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈయన రణ్‌బీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. (Twitter/Photo)