Ram Charan: రీసెంట్గా రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే కదా. ఎంతో అట్హహాసంగా ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు చిరంజీవి, రాజమౌళి, రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులగా హాజరయ్యారు. ఆ సంగతి పక్కన పెడితే.. రామ్ చరణ్.. శంకర్ తర్వాత మరో తమిళ దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. : Twitter
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మొత్తంగా రామ్ చరణ్ క్రేజీ దర్శకులను లైన్లో పెట్టి కెవ్వు కెేక పుట్టిస్తున్నారు. (Twitter/Photo)
కార్తితో ‘ఖైదీ’ , విజయ్‌తో ‘మాస్టర్’ సినిమాలతో ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సస్సెన్స్ థ్రిల్లర్ స్టోరీతో చరణ్‌ను ఇంప్రెస్ చేసాడట. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత లోకేష్‌తోనే నెక్ట్స్ ప్రాజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ లోకేష్ కనకరాజ్.. మాత్రం మాస్టర్ తర్వాత కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఉంది. త్వరలో ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశాలున్నాయి. (Twitter/Photo)
అటు రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని ‘జెర్సీ’తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయడం దాదాపు ఖరారైంది. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ దర్శకుడు ’జెర్సీ’ హింధీ రీమేక్ చేస్తున్నారు. ఇక గౌతమ్ తిన్ననూరి సినిమాను శంకర్ సినిమాతో పాటే చేయాలనే ఆలోచనలో ఉన్నారు రామ్ చరణ్. (Twitter/Photo)
మరోవైపు రామ్ చరణ్ వంశీ పైడిపల్లి చెప్పిన కథను ఓకే చేసాడు. ఈ ప్రాజెక్ట్ ఎపుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి. ప్రస్తుతం వంశీ పైడిపల్లి.. విజయ్‌తో ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత చిరంజీవితో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్, వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఎవడు తర్వాత వీళ్లిద్దరు మరోసారి ఈ సినిమా కోసం చేతులు కలుపుతున్నారు. (Twitter/Photo)
‘ఛలో’, ‘భీష్మ’ వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న వెంకీ కుడుములతో నెక్ట్స్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇప్పటికే వెంకీ కుడుముల చెప్పిన కథకు రామ్ చరణ్ ఇంప్రెస్ అయ్యాడట. త్వరలో అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. మరోవైపు వెంకీ కుడుముల మహేష్ బాబుతో పాటు వరుణ్ తేజ్‌తో వరుస ప్రాజెక్ట్స్ సెట్ అయినట్టు తెలుస్తోంది. (Twitter/Photo)