కానీ 2022లో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతికి ఒక వారం ముందుగా జనవరి 7న విడుదల కానుంది. ఆ తర్వాత ఒక నెల గ్యాప్లోనే తండ్రి చిరంజీవితో పూర్తి స్థాయిలో తొలిసారి నటించిన ‘ఆచార్య’ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానుంది. మొత్తంగా ఒకే క్యాలండర్ ఇయర్లో అది కూడా నెల రోజుల వ్యవధిలో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు విడుదల కావడం ఇదే మొదటిసారి. (Twitter/Photo)
ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంతో పాటు తండ్రి మెగాస్టార్ చిరంజీవితో పూర్తి స్థాయిలో నటించాలనే కోరిక కూడా ‘ఆచార్య’ సినిమాతో నెరవేరతుంది. మరోవైపు రామ్ చరణ్ తన కెరీర్లో మొదటిసారి ఓ డైరెక్టర్ దర్శకత్వంలో రెండోసారి నటించారు. అది రాజమౌళి కావడం విశేషం. మరోవైపు ఈ రెండు సినిమాల్లో ఒక సినిమాలో ఎన్టీఆర్, అజయ్ దేవ్గణ్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అటు ‘ఆచార్య’లో తండ్రి చిరుతో కలిసి నటించడం విశేషం. మొత్తంగా 2022 కాలండర్ ఇయర్ రామ్ చరణ్ నటించిన ఈ రెండు సినిమాలు మల్టీస్టారర్ మూవీస్ కావడం విశేషం. మొత్తంగా రామ్ చరణ్ ఫిల్మ్ కెరీర్లో 2022 వెరీ స్పెషల్ అని చెప్పాలి. (Ram Charan and Pooja Hegde Photo : Twitter)