రామ్ చరణ్ కేవలం హీరో మాత్రమే కాదు టాలీవుడ్ స్టైల్ ఐకాన్ కూడా. పైకి కనిపించడు కానీ చాలా వరకు ఈయన వాడే వస్తువులు కోట్ల రూపాయల్లో ఉంటాయి. అలాగే రామ్ చరణ్ దగ్గర ఉన్న వాచీల గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. మెగా వారసుడి దగ్గర 7 అత్యంత ఖరీదైన వాచ్‌లు ఉన్నాయి. ఒక్కొక్కటి కనీసం 10 లక్షల కంటే పైన.. అత్యధికంగా కోటి వరకు ఉన్న వాచ్‌లు కూడా ఈయన దగ్గరున్నాయి. ముఖ్యంగా చేతి వాచీల కలెక్షన్ అంటే రామ్ చరణ్‌కు చాలా యిష్టం.
ప్రపంచంలో ఉన్న టాప్ బ్రాండ్స్ అన్నీ ఈయన దగ్గర ఉన్నాయి. ఏ దేశం వెళ్లినా కూడా రామ్ చరణ్ ముందుగా కొనేది వాచ్. లగ్జరీ వాచ్‌లను కొనుగోలు చేయడానికి ఎక్కువగా యిష్టపడుతుంటాడు రామ్ చరణ్. అంతేకాదు తనకు నచ్చిన వాళ్లకు కూడా గడియారాలనే గిప్టులుగా ఇస్తుంటాడు మెగా వారసుడు. ఈయన దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన వాచీల గురించి తెలుసుకుందాం పదండి..