ఈ రోజు మెగా మదర్ అంజనా దేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవికి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ.. మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టినరోజు నేడు. జన్మ జన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరకుంటానని ట్వీట్ చేసారు. మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. (Twitter/Photo)
ముగ్గురు మొనగాళ్లను కన్న అమ్మ అంజనా దేవి అంటూ మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ సరదాగా చెప్పుకుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ముగ్గురూ ముగ్గురే.. అలాంటి స్టార్స్‌కు జన్మనిచ్చిన అమ్మ పుట్టిన రోజు జనవరి 29.ఈ మెగా బ్రదర్స్ ముగ్గరు సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
ఇక మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దాదాపు 67 యేళ్ల వయసులో చిరంజీవిలో ఎనర్జీ లెవల్స్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయింది.ఈ సినిమా దాదాపు రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మెగాస్టార్ ఇంట్లో జరిగిన అంజనా దేవి పుట్టినరోజు వేడుకలకు మెగా బ్రదర్స్‌తో తోబుట్టువులతో పాటు రామ్ చరణ్ దంపతులు నానమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. (Twitter/Photo)
ఆ తర్వా త ఈ బ్యానర్లో త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారూ బాగున్నారా. స్టాలిన్, గుడుంబా శంకర్, కౌరవుడు, రాధా గోపాలం, ఆరెంజ్ సినిమాలను తెరకెక్కాయి. మొత్తంగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అంజనా దేవికి మెగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. (Twitter/Photo)