తెలుగు సినిమాలకు సంక్రాంతికి విడదీయరానీ అనుబంధం ఉంది. ఈ సీజన్లో తమ సినిమాలు విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు.. నిర్మాతలకు కాసుల వర్షం కురిసినట్టే. ఈ సీజన్లో ఒకటి మూడు సినిమాలు వచ్చినా.. ఆదిరించడానికి మేము రెడీ అంటూ ప్రేక్షకులు సైతం సంక్రాంతి సీజన్లో హిట్ టాక్ వచ్చిన అన్ని సినిమాలను ఆదిరించిన సందర్భాలున్నాయి. తాజాగా 2023 పొంగల్ సీజన్లో ఇప్పటికే చిరంజీవి.. బాబీ దర్శకత్వంలో చేస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. మరోవైపు మరో ఇతర మెగా హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లు కూడా సంక్రాంతి సీజన్లో బాక్సాఫీస్ దగ్గర కాలు దువ్వుతున్నారు. (Twitter/Photo)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ఓ నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి దర్శకుడు బాబీ (కే.యస్. రవీంద్ర)దర్శకత్వంలో తెరకెక్కతోన్న మాస్ యాక్షన్ మూవీ #Mega154. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ దాదాపు ఖరారు చేశారు. ఈ సినిమాను సంక్రాంతి రేసులో విడుదల కన్ఫామ్ చేశారు. రిలీజ్ డేట్ ఎపుడనేది ప్రకటించలేదు. ( Photo : Twitter)
క్రిష్ దర్శకత్వంలో ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు పవన్. ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయింది. త్వరలోనే మళ్లీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో పవన్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. పునర్జన్మల నేపథ్యంలో సాగే కథగా ఇది తెలుస్తుంది. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 17వ శతాబ్ధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని క్రిష్ తొందర్లనే పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలిపాలనే ప్లాన్‌లో ఉన్నారు. మరి అన్నయ్య సినిమాకు పోటీగా పవన్ కళ్యాణ్ వస్తాడా అనేదిచూడాలి.