Varun Tej: వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు క్లారిటీ.. కాబోయే పెళ్లి కూతురు ఎవరంటే..
Varun Tej: వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు క్లారిటీ.. కాబోయే పెళ్లి కూతురు ఎవరంటే..
Varun Tej: టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలుకుతున్నారు. రీసెంట్గా శర్వానంద్ తన బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలకబోతున్నాడు. ఈ కోవలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా వెల్లడించారు.
నిహారిక మ్యారేజ్ తర్వాత నాగబాబు తన తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో పెళ్లి కూతురును వెతికే పనిలో పడ్డాడు. అంతేకాదు ఈ యేడాదే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు. (Twitter/Photo)
2/ 10
టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలుకుతున్నారు. రీసెంట్గా శర్వానంద్ తన బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలకబోతున్నాడు. ఈ కోవలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా వెల్లడించారు. (Twitter/Photo)
3/ 10
వరుణ్ తేజ్ చేసుకోబోయే అమ్మాయి కూడా హీరోయిన్ లేదా వాళ్ల బంధువుల్లో అమ్మాయి అనే విషయం క్లారిటీ రావాల్సి ఉంది. కానీ వరుణ్ తేజ్.. టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నాడనే వార్త గుప్పుమంటోంది. దీనిపై వరుణ్ తేజ్ కానీ నాగబాబు కానీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. (twitter/Photo)
4/ 10
వరుణ్ తేజ్ విషయానికొస్తే.. చిరంజీవి అతిథి పాత్రలో నాగబాబు, బ్రహ్మానందం లీడ్ రోల్లో నటించిన ‘హ్యాండ్సప్’ చిత్రంలో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముకుందా’తో హీరోగా వెండితెరకు పరిచయమైయ్యాడు.
5/ 10
ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేసిన ‘కంచె’ మూవీలో నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. ఆ తర్వాత లోఫర్, మిస్టర్ సినిమాలు చేసిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. (Twitter/Photo)
6/ 10
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫిదా’ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత తొలిప్రేమ సినిమాతో మరో హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. (Twitter/Photo)
7/ 10
ఆ తర్వాత ఘాజీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతరిక్షం 9000 KMPH మంచి ప్రయోగాత్మక చిత్రంగా పేరొచ్చినా.. కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. (Twitter/Photo)
8/ 10
సినీ కెరీర్లో కేవలం హీరోగా కాకుండా నిహారిక నిర్మించిన ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్‌కు వాయిస్ ఓవర్ అందించారు. అటు అల్లాదిన్ అనే కామిక్స్ చిత్రానికి గాత్రదానం చేసాడు. (Twitter/Photo)
9/ 10
2019లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో వెంకటేష్‌తో చేసిన ‘F2’ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన ‘గద్దలకొండ గణేష్’ మూవీలో తన నటనతో ఆకట్టుకున్నాడు. (Twitter/Photo)
10/ 10
గతేడాది ‘గని’ మూవీతో డిజాస్టర్ అందుకున్న వరుణ్ తేజ్.. ఎఫ్ 3 మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. తాజాగా వరుణ్ తేజ్.. ‘గాండీవధారి అర్జున’ మూవీతో పలకరించనున్నాడు. ఏది ఏమైనా 2023లో వరుణ్ తేజ్.. పెళ్లి పీఠలు ఎక్కడం ఖాయమనే విషయం రూఢీ అయింది. (Varun Tej Praveen Sattaru movie)