Meera Jasmine: ట్రెండ్ అవుతున్న మీరా జాస్మిన్ ఫొటోస్.. చూస్తే మీరా? అనాల్సిందే..
Meera Jasmine: ట్రెండ్ అవుతున్న మీరా జాస్మిన్ ఫొటోస్.. చూస్తే మీరా? అనాల్సిందే..
Meera Jasmine Treditional looks: తన గ్లామర్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు హార్ట్ బ్రేక్ చేస్తూ వస్తున్న మీరా జాస్మిన్.. తాజాగా కొన్ని ట్రెడిషనల్ లుక్స్ పోస్ట్ చేసింది. చీరకట్టులో చురకత్తుల్లాంటి చూపులతో ఆకర్షించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్ సినిమాలో నటించి యువ హృదయాల్ని కొల్లగొట్టిన మీరా జాస్మిన్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది. సినిమాల్లో నటించకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తోంది.
2/ 8
తన గ్లామర్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు హార్ట్ బ్రేక్ చేస్తూ వస్తున్న ఈ సీనియర్ అందం.. తాజాగా కొన్ని ట్రెడిషనల్ లుక్స్ పోస్ట్ చేసింది. చీరకట్టులో చురకత్తుల్లాంటి చూపులతో ఆకర్షించింది మీరా. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ అయ్యాయి.
3/ 8
ఒకప్పుడు హోమ్లీ లుక్స్‌తో వెండితెరపై తన మార్క్ చూపించిన మీరా జాస్మిన్.. ఇప్పుడు సినిమాల పరంగా రెస్ట్ మోడ్ లో ఉంది. అయినా కూడా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ అండ్ స్వీట్ స్టిల్స్ షేర్ చేస్తూ సామజిక మాధ్యమాల్లో చురుకుగా వ్యవహరిస్తోంది. దీంతో మళ్ళీ మీరా జాస్మిన్ ట్రెండ్ షురూ అయింది.
4/ 8
గతంలో పలు సినిమాల్లో బొద్దుగా కనిపించి కెమెరా ముందు కవ్వించిన మీరా.. ఇప్పుడు నెవర్ బిఫోర్ అనేలా నాజూకుగా తయారై అట్రాక్ట్ చేస్తోంది. ఆమె లేటెస్ట్ ఫొటోస్ చూస్తుంటే పెళ్లి తర్వాత ఫిట్నెస్ విషయంలో ఆమె ఎంత జాగ్రత్త తీసుకుందనేది స్పష్టమవుతోంది.
5/ 8
గ్లామర్ ప్రపంచానికి దూరమైందని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా రీ ఎంట్రీ ఇచ్చి తన షాకింగ్ లుక్స్ పంచుకుంటోంది మీరా జాస్మిన్. ఫిజిక్ పరంగా తాను ఎంతలా ట్రాన్స్ఫామ్ అయ్యాననేది స్పష్టం చేస్తూ తన నాజూకు అందాలను సోషల్ మీడియాలో పరుస్తోంది.
6/ 8
తెలుగులో అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, మహారధి, రారాజు, యమగోల మళ్ళీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు, బంగారు బాబు, అ ఆ ఇ ఈ, ఆకాశ రామన్న వంటి చిత్రాల్లో నటించింది మీరా జాస్మిన్. చివరగా మోక్ష అనే సినిమాలో కనిపించింది.
7/ 8
2014 సంవత్సరంలో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేసే అనిల్ జాన్ టైటస్‌ను పెళ్ళాడి దుబాయ్ వెళ్లిపోయింది. తిరిగి ఇన్నేళ్లకు మళ్ళీ యాక్టీవ్ అయింది మీరా. హాట్ గేర్ వేసి సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.
8/ 8
కొన్ని తెలుగు సినిమాలు చేసి ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మీరా జాస్మిన్ తిరిగి ఇప్పుడు రీ- ఎంట్రీకి సిద్దమైనట్లు తాజా పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ మరింత జోష్ లో ఉండేలా మీరా ప్లాన్ చేసుకుంటున్నట్లు తాజా ఫొటోస్ స్పష్టం చేస్తున్నాయి.