తెలుగులో ఆమె మొదటి చిత్రం సీనియర్ , బాలకృష్ణ నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’. కానీ అంతకు ముందు టి.సుబ్బరామిరెడ్డి నిర్మాణంలో రాజా చంద్ర దర్శకత్వంలో శోభన్ బాబు, రజినీకాంత్ హీరోలుగా నటించిన ‘జీవన పోరాటం’ మూవీలో ఓ పాటలో మెరిసింది. అయితే ఈమెకు ‘ఆపద్బాంధవుడు’ చిత్రమే ఈమెకు తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టింది. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది మీనాక్షి శేషాద్రి. ఇక ఆపద్భాందవుడు సినిమాలోని నటనకు ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా అందుకున్నారు.
అసలు వీటిని చూసిన తర్వాత అప్పుడు మనం చూసిన మీనాక్షి ఈమెనా అనే అనుమానాలు రావడం సహజం. అంతగా మారిపోయారు మీనాక్షి శేషాద్రి. ఆమెను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. మేం అప్పుడు చూసిన అందాల మీనాక్షి ఈమె కాదంటూ కామెంట్ చేస్తున్నారు. ఈమె హిందీలో హీరో, మేరీ జంగ్, షెహెన్షా, గంగ జమున సరస్వతి, దామిని, ఘాయల్, డ్యూయట్ వంటి చిత్రాలు ఈమెకు హీరోయిన్గా మంచి పేరు తీసుకొచ్చాయి.
అప్పట్లో వరస సినిమాలు చేసిన ఈమె.. ఆ తర్వాత ఒక్కసారిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత మీనాక్షి శేషాద్రికి ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. మధ్యలో టాలీవుడ్ నుంచి కూడా మీనాక్షికి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఫ్యామిలీ లైఫ్ వైపు అడుగులు వేసారు. (Meenakshi Seshadri/facebook)