మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న అందాల భామ. ఇచట వాహనములు నిలుపరాదు, ఖిలాడి వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది. ఈ భామ తాజాగా అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2లో నటించింది. ఈ సినిమాలో ఆమె ఆర్యా అనే పాత్రలో కనిపించింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. Photo : Instagram
ఇక అది అలా ఉంటే ఈ భామకు ఓ అదిరిపోయే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు 2 వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి ఎంపికైనట్లు తెలుస్తోంది. గతంలో ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల అనుకున్నారు. ఆ తర్వాత అనుపమ వచ్చింది. ఓ షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. అయితే కొన్ని భేదాల కారణంగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో మడోన్న చేస్తుందని అన్నారు. ఇక చివరకు ఈ పాత్ర మీనాక్షికి చేరిందని తాజా టాక్. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో... Photo : Instagram
ఇక హిట్ 2 విషయానికి వస్తే... హీరో ఎలా విలన్ రూపంలో తనకు ఎదురయ్యే ఛాలెంజ్‌ను చేధించాడు అనేది థ్రిల్లింగ్‌గా చూపించారు. దీనికి తోడు సౌండ్, పిశ్చర్ అదిరిపోయింది. సినిమా హిట్ అని అంటున్నారు నెటిజన్స్అ యితే ఓ ఛాలెంజింగ్ కేస్ దొరికితే ఎలా ఉంటుంది.. అప్పుడు కృష్ణదాస్ నటిస్తున్న శేష్‌గా ఎలా ఆ కేసును సాల్వ్ చేశారు అనేది సినిమా. ఈ సెకండ్ పార్ట్‌లో మరింతగా యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ సీన్స్ అదిరాయని అంటున్నారు నెటిజన్స్.. ఈ మూవీని ప్రశాంతి త్రిపురనేని, హీరో నానిలు కలిసి నిర్మించారు.. Photo : Instagram
హిట్ 1 తెలంగాణ నేపథ్యంగా సాగగా.. హిట్ 2 ఏపీ నేపథ్యంగా సాగనుంది. హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా కనిపించింది. ఇక ఈ సినిమా హీరో అడివి శేష్ (Adivi Sesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. Photo : Instagram
కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డ.. ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్లను అందుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళీ భాషల్లో విడుదలై మంచి లాభాలను తెచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్ , రేవతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. Photo : Instagram
ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని చూపించారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్లో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో పాటు GMB ఎంటర్టైన్మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మించారు. Photo : Instagram
ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన ఈ భామ.. 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఓటీటీ వేదిక ఆహాలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. Photo : Instagram